తెలంగాణ ఆర్టీసీలో కరోనా కలకలం: 200 మందికి కోవిడ్

By narsimha lodeFirst Published Aug 12, 2020, 11:42 AM IST
Highlights

తెలంగాణ ఆర్టీసీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆర్టీసీలో పనిచేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు సహా ఉద్యోగులు సుమారు 200 మంది కరోనా బారినపడ్డారు. కరోనాతో రాష్ట్రంలో సుమారు  10 మంది మృతి చెందారు.

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆర్టీసీలో పనిచేస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు సహా ఉద్యోగులు సుమారు 200 మంది కరోనా బారినపడ్డారు. కరోనాతో రాష్ట్రంలో సుమారు  10 మంది మృతి చెందారు.

కరోనాతో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఏడాది మే 19వ తేదీన ఆర్టీసీ బస్సులను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆర్టీసీ బస్సులను నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం బస్సులను శానిటేషన్ చేసేవారు. 

ప్రతి బస్సుల్లో డ్రైవర్, కండక్టర్లకు శానిటైజర్ ఇచ్చేవారు. కోదాడ ఆర్టీసీ బస్సు డిపో కండక్టర్ కు శానిటైజర్ ఇవ్వకపోవడంతో కోదాడ డిపో ఆర్టీసీ డీఎంను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  సస్పెండ్ చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు డీఎంను సస్పెండ్ చేశారు.

also read:పార్శిల్, కార్గో సర్వీసుల సక్సెస్: అమెజాన్‌తో చర్చలకు తెలంగాణ ఆర్టీసీ సిద్దం

బస్సు భవన్ లో ఈ ఏడాది జూలై మాసంలో తొలుత ఐదుగురికి కరోనా సోకింది. ఆ తర్వాత కరోనా సోకిన వారి సంఖ్య 15కి చేరింది. ప్రస్తుతం తమకు కనీసం మాస్కులు శానిటైజర్లు కూడ ఇవ్వడం లేదని  కండక్టర్లు, డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీలో మొత్తం సుమారు 49 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 21 వేల మంది పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో సిటీలో ఆర్టీసీ బస్సులు ఇంకా నడపడం లేదు. 

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు తగ్గితే సీటీ బస్సులను నడిపే అవకాశం ఉంది. మెట్రో సర్వీసులను నడిపే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం రాష్ట్రాలు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
 

 

click me!