కేసీఆర్ ప్రధాని కావాలి: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

By telugu teamFirst Published Feb 17, 2020, 3:48 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: 

ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినం పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర రోడ్లు,భవనాలు, గృహ నిర్మాణృం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మొక్కలు నాటారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రజా సంక్షేమమే ద్యేయంగా పనిచేసే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఆరోగ్యంతో ఇంకా 34 ఏళ్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా పనిచేయాలని ఆకాంక్షించారు.
 రాష్ట్రానికి సేవలు అందించడమే కాకుండా అవసరం ఉన్నంత కాలం ముఖ్యమంత్రి గా ఉండి ఆ తరువాత దేశానికి కూడా సేవలు అందించాలని ఆయన అన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు తీరుపై యావత్తు దేశం ఆసక్తిగా రాష్ట్రం వైపు చూస్తోందని, తెలంగాణ రాష్ట్ర నాయకత్వాన్ని భారతదేశం ఆహ్వానించే పరిస్థితులు వస్తున్నాయని  మంత్రి వేముల వ్యాఖ్యానించారు. హరితహారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టమైన కార్యక్రమమని అందుకే తెలంగాణ లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.

భావితరాలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో, ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడం ఆయన ఆశయమన్నారు.
 రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్  ద్వారా మొక్కలు నాటే కార్యక్రమంలో దేశవ్యాప్తంగా అందర్ని భాగస్వామ్యం చేస్తూ,వాటిని సంరక్షించేందుకు కృషి చేస్తున్నారన్నారు.

తనకు దైవ సమాణులైన సీఎం కేసీఆర్ 66వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా వారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటినట్లు చెప్పారు.ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని,నిరంతరం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకోరుకుంటున్నట్లు మంత్రి వేముల తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని  మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్,విప్ లతో కలసి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటారు.

అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫిట్ నెస్ సెంటర్(జిమ్),శాసనసభ 2020  క్యాలెండర్,సభ్యుల వివరాలతో కూడిన బుక్ లెట్ మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బర్త్ డే కేక్ కట్ చేసి మండలి ఛైర్మన్,అసెంబ్లీ స్పీకర్ తో కలిసి నాలుగవ తరుగతి ఉద్యోగులకు బట్టలు పంపిణీ చేశారు.

ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అధికారులు,ఉద్యోగులతో కలిసి రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ఈఎన్సీలు గణపతి రెడ్డి,రవీందర్ రావు పలువురు సీఇలు,ఎస్ఇలు,ఆర్ అండ్ బి ఉద్యోగులు పాల్గొన్నారు.

click me!