విద్యాసంస్థల పున:ప్రారంభంపై అధికారులతోకేసీఆర్ భేటీ: నేడు ప్రభుత్వ కీలక నిర్ణయం

By narsimha lodeFirst Published Aug 23, 2021, 3:43 PM IST
Highlights

తెలంగాణలో విద్యా సంస్థల పున:ప్రారంభంపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రగతి భవన్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో కేసీఆర్ భేటీ అయ్యారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యా సంస్థలను పున: ప్రారంభించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచారం.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థల పున:ప్రారంభంపై సీఎం కేసీఆర్ సోమవారం నాడు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ విషయమై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నాడు.

తెలంగాణలో విద్యా సంస్థలను తెరుచుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ కూడ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే సీఎంఓకు నివేదికను అందించింది. విద్యా సంస్థలు తిరిగి తెరిచే విషయంలో  సన్నద్దత విషయంలో విద్యాశాఖ కూడా ప్రభుత్వానికి రిపోర్టును పంపింది. 

ప్రగతి భవన్ లో ఇవాళ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సెప్టెంరబ్ 1వ తేదీ నుండి విద్యా సంస్థల పున: ప్రారంభానికి సంబంధించి సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేసిన  జూలై 1వ తేదీ నుండి విద్యాసంస్థలను ప్రారంభించాలని భావించింది. అయితే కరోనా థర్డ్‌వేవ్ వస్తోందని నిపుణులు హెచ్చరించడంతో విద్యాసంస్థలను తెరవలేదు.సెప్టెంబర్ 1వ తేదీ నుండి తిరిగి విద్యాసంస్థలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. విద్యా సంస్థల పున: ప్రారంభంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

click me!