నేను వెర్రిపువ్వును కాదు: బీజేపీ నేతలపై మంత్రి పువ్వాడ మండిపాటు

By Siva KodatiFirst Published Dec 2, 2020, 4:01 PM IST
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయన కాన్వాయ్‌ హైదరాబాద్‌లో హల్ చల్ చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయన కాన్వాయ్‌ హైదరాబాద్‌లో హల్ చల్ చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

పువ్వాడకి చెందిన కాన్వాయ్‌లో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు.. ఆయనకు చెందిన కారుపై దాడి కూడా చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలతో పాటు పలువురికి గాయాలు కూడా అయ్యాయి.

దీంతో పువ్వాడను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. నిన్న దీనిపై స్పందించని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. బుధవారం వివరణ ఇచ్చారు.

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో వున్న మెడికల్ కాలేజీకి వెళ్తుండగా.. కోరమాల్ వద్ద బీజేపీ కార్యకర్తలు తన కాన్వాయ్‌పై దాడి చేశారని ఆయన పేర్కొన్నారు.  బీజేపీ కార్యకర్తలు ప్రస్టేషన్‌తో తనపై దాడి చేశారని వెల్లడించారు.

కారులో డబ్బులు పెట్టి పంచడానికి తాను వెర్రిపువ్వుని కాదు.. బీజేపీ కార్యకర్తలు ఎక్కిన కారు తనది కాదని పువ్వాడ తేల్చి చెప్పారు. తన కాన్వాయ్‌లో అన్నీ ఫార్చూనర్ వాహనాలేనని.. బీజేపీ కార్యకర్తలు తనను చంపడానికి ప్రయత్నించారని పువ్వాడ ఆరోపించారు.

బీజేపీ నాపై చేసిన దాడిని ఈ చికెన్ నారాయణ సమర్థిస్తున్నారా అంటూ మంత్రి దుయ్యబట్టారు. తాను కూడా కమ్యూనిస్టు బిడ్డనేనని .. ఇలాంటి దాడులకు భయపడేది లేదని అజయ్ కుమార్ వెల్లడించారు.

నారాయణ లాంటి సీనియర్ నేత అసలేం జరిగింది అనే పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడటం సరికాదని పువ్వాడ తప్పుబట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌కు పరాభవం తప్పదని.. గ్రేటర్‌లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
 

click me!