అక్కడ రిపోలింగ్ జరపాలి: ఎంఐఎంపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన బిజెపి

By Arun Kumar PFirst Published Dec 2, 2020, 3:04 PM IST
Highlights

మంగళవారం జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎంఐఎం రిగ్గింగ్ కు పాల్పడిందంటూ బిజెపి ఈసీకి ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్: జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని బిజెపి మొదట్నుంచి ఆరోపిస్తోంది. తాజాగా మంగళవారం జరిగిన పోలింగ్ సమయంలో ఎంఐఎం మరింత అరాచకంగా వ్యవహరించదని... నిబంధనలను పాటించకుండా అక్రమాలకు పాల్పడిందని బిజెపి మండిపడింది. పలు పోలింగ్ బూతుల్లో ఎంఐఎం నాయకులు రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రారావు, ఆంటోని రెడ్డి లు ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. 

ఎస్‌ఈసీకి ఎంఐఎంపై ఫిర్యాదు చేసిన తర్వాత బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రారావు మాట్లాడుతూ... పాతబస్తీలో మజ్లీస్‌ పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడుతుందని తమకు పక్కా సమాచారం వుందన్నారు. దీనిపై పోలింగ్ సమయంలోనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని... అయినా వారు రిగ్గింగ్ ను ఆపకుండా ఎంఐఎం కే సహకరించారన్నారు. 

ఇలా రిగ్గింగ్ జరగడం వల్లే సాయంత్రం ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరిగిందన్నారు. ముఖ్యంగా ఘాన్సీబజార్‌లో పోలింగ్‌ స్టేషన్‌ 1 నుంచి 19 వరకు, పురానాపూల్‌లో పోలింగ్‌ స్టేషన్‌ 3,4,5 మరియు 38 నుంచి 45 వరకు ఉన్న బూత్‌లలో 94 శాతం పోలింగ్‌ జరిగిందని... ఎంఐఎం రిగ్గింగ్ చేయడంవల్లే పోలింగ్ శాతం అమాంతం పెరిగిందన్నారు. అందువల్ల రిగ్గింగ్ జరిగినట్లు తాము ఫిర్యాదు చేసిన డివిజన్లలో రిపోలింగ్ జరపాలని ఎస్ఈసీని కోరినట్లు రామచంద్రారావు వెల్లడించారు. 


 

click me!