ఎమ్మెల్యేలు ఎందుకు సమావేశమయ్యారో తెలుసుకుంటా: మంత్రి మల్లారెడ్డి

By narsimha lode  |  First Published Dec 19, 2022, 2:37 PM IST


ఎమ్మెల్యేలు  ఎందుకు  సమావేశమయ్యారో తనకు  తెలియదని  తెలంగాణ మంత్రి  మల్లారెడ్డి  చెప్పారు. ఈ విషయమై తాను ఎమ్మెల్యేలతో  చర్చించనున్నట్టుగా  తెలిపారు. 


హైదరాబాద్: తమ పార్టీకి  చెందిన ఎమ్మెల్యేలు  ఎందుకు  సమావేశమయ్యారో తనకు  తెలియదని  తెలంగాణ రాష్ట్ర  మంత్రి మల్లారెడ్డి  చెప్పారు.సోమవారం నాడు  ఉదయం మంత్రి మల్లారెడ్డి గద్వాల జోగులాంబ జిల్లాలో  మీడియాతో మాట్లాడారు. తన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు  సమావేశమైన  విషయం గురించి హైద్రాబాద్ కు వెళ్లిన  తర్వాత  తెలుసుకుంటానని తెలిపారు.తాను పదవులను తన్నుకుపోలేదన్నారు.  గద్వాల జిల్లాలో పర్యటన కారణంగా ఆ సమావేశానికి హాజరుకాలేకపోయినట్టుగా మంత్రి మల్లారెడ్డి చెప్పారు..జిల్లాకు చెందిన  పదవుల విషయంలో  కేటీఆర్ తో చర్చించనున్నట్టుగా మల్లారెడ్డి తెలిపారు. మార్కెట్ కమిటీకి సంబంధించి సమస్య లేనేలేదన్నారు. అది పాత జీవో అని మంత్రి మల్లారెడ్డి  చెప్పారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో తనకు మధ్య గ్యాప్ లేదని  మంత్రి స్పష్టం చేశారు.  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో   మంత్రి మల్లారెడ్డి తన నియోజకవర్గానికే  నామినేటేడ్ పదవులను తీసుకెళ్తున్నారని  బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 

మల్కాజిగిరి ఎమ్మెల్యే  మైనంపల్లి హన్మంతరావు  నివాసంలో  ఇవాళ  బీఆర్ఎష్ ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించడం  ఆ పార్టీలో కలకలం రేపుతుది.  ఉప్పల్  ఎమ్మెల్యే  బేతి సుభాష్ రెడ్డి , కూకట్ పల్లి ఎమ్మెల్యే  మాధవరం కృష్ణారావు,  కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే  కేపీ వివేకానంద గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే  అరికెపూడి గాంధీలు  మైనంపల్లి హన్మంతరావు  నివాసంలో సమావేశమయ్యారు.  తమ నియోజకవర్గంలో అభివృద్ది పనులతో పాటు  పార్టీ కార్యకర్తలకు  నామినేటేడ్  పదవుల విషయంలో  మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని  ఆరోపించారు.తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు  ఇబ్బంది పడుుతున్నారన్నారు.  

Latest Videos

పార్టీ పదవులను  తన నియోజకవర్గానికి మంత్రి మల్లారెడ్డి తీసుకెళ్తున్నారని  ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మార్కెట్ కమిటీ  పదవి విషయంలో  జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు.ఈ పదవిని కూడా  మంత్రి  మల్లారెడ్డి తన అనుచరుడికి  ఇప్పించాడు.ఈ విషయమై  ఎమ్మెల్యేలు  వ్యతిరేకించినా కూడా  ఆయన తన పంతం వీడలేదని  బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో  ఉంది. 

also read:మైనంపల్లి ఇంట్లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ.. అందుకోసమేనా..?

ఇప్పటికే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో  మంత్రి మల్లారెడ్డికి మధ్య గ్యాప్ ఉంది. మంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో  ఇతర నియోజకవర్గాలకు  చెందిన ఎమ్మెల్యేలు  కూడా  మంత్రి మల్లారెడ్డి తీరుపై ఆగ్రహంగా  ఉన్నారు. దీంతో  ఇవాళ  మైనంపల్లి హన్మంతరావు నివాసంలో భేటీ అయ్యారు.మైనంపల్లి హన్మంతరావు నివాసంలో భేటీ అయిన  ఎమ్మెల్యేలకు  సీఎం కార్యాలయం నుండి పిలుపు వచ్చింది.  ఇవాళ సాయంత్రం  అందుబాటులో ఉండాలని  సీఎం కార్యాలయం నుండి  సమాచారం అందింది.
 

click me!