డబ్బా పాలు వద్దు -తల్లి పాలు ముద్దు: మంత్రి మల్లారెడ్డి

Siva Kodati |  
Published : Aug 04, 2019, 04:00 PM IST
డబ్బా పాలు వద్దు -తల్లి పాలు ముద్దు: మంత్రి మల్లారెడ్డి

సారాంశం

దేశంలోనే మొట్టమొదటి తల్లి పాల బ్యాంక్‌ను నిలోఫర్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆదివారం ధాత్రి తల్లి పాల బ్యాంక్ మరియు స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో జరిగిన వాక్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు

దేశంలోనే మొట్టమొదటి తల్లి పాల బ్యాంక్‌ను నిలోఫర్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆదివారం ధాత్రి తల్లి పాల బ్యాంక్ మరియు స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో జరిగిన వాక్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన గంట లోపల అమృతం వంటి తల్లిపాలు అందించడం ఎంతో శ్రేష్టమన్నారు. ప్రస్తుత రోజుల్లో డబ్బా పాలను అందిస్తున్నారని.. ఇది బిడ్డ పెరుగుదల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుందని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అన్ని రకాల వ్యాధులను తట్టుకునే శక్తి కేవలం తల్లిపాలకు మాత్రమే ఉందని... డబ్బా పాలకు కాదన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, తల్లులు, పుట్టిన బిడ్డలని అన్ని రకాలుగా ఆదరిస్తోందని మల్లారెడ్డి తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?