మంత్రి సత్యవతి రాథోడ్ ని ఇంటర్వ్యూ చేసిన కేటీఆర్ తనయుడు

By telugu teamFirst Published Nov 20, 2019, 10:12 AM IST
Highlights

 మంగళవారం ఆమె సైదాబాద్ లోని జువైనల్ హోమ్ ని సందర్శించారు. బాల నేరస్తుల పట్ల మానవత్వం తో వ్యవహరించి.. తల్లిదండ్రుల లోటు తీరుద్దామని మహిళా శిశు సం క్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. వారిని చిన్నచూపు చూడటం తగదని పేర్కొన్నారు. 
 

తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ని మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇంటర్వ్యూ చేశాడు.  ఈ విషయాన్ని హిమాన్షు స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు. తన స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంత్రిని ఇంటర్వ్యూ చేసినట్లు హిమాన్షు వివరించాడు. బాలల సంక్షేమం గురించి చర్చించినట్లు చెప్పాడు.

 

ఇదిలా ఉండగా... మంగళవారం ఆమె సైదాబాద్ లోని జువైనల్ హోమ్ ని సందర్శించారు. బాల నేరస్తుల పట్ల మానవత్వం తో వ్యవహరించి.. తల్లిదండ్రుల లోటు తీరుద్దామని మహిళా శిశు సం క్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. వారిని చిన్నచూపు చూడటం తగదని పేర్కొన్నారు. 

 బాలల్లో నేర ప్రవృత్తి నిరోధించాలంటే తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్‌ ఇవ్వాలని మంత్రి అభిప్రాయపడ్డారు. హోంలోని కొందరు బాలలను చూసేందుకు వారి తల్లిదండ్రులు రావడం లేదని తెలుసుకున్న మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారిని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

click me!