ఓడి ఇంట్లో కూర్చుంటే, పిలిచి మంత్రిని చేశారు.. ఇప్పుడు కేసీఆర్‌కే ద్రోహం : తుమ్మలపై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Sep 30, 2023, 4:45 PM IST

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టార్గెట్‌గా పరోక్ష వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న వారికి కేసీఆర్ పిలిచి మరి మంత్రి పదవి ఇచ్చారని , ఈసారి టికెట్ రాలేదని పార్టీకి ద్రోహం చేసి పోయారని దుయ్యబట్టారు. 


ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టార్గెట్‌గా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓడిపోయి ఇంట్లో కూర్చున్న వారికి కేసీఆర్ పిలిచి మరి మంత్రి పదవి ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు. అలాంటివాళ్లే ఈసారి టికెట్ రాలేదని పార్టీకి ద్రోహం చేసి పోయారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు దేవుడిలా కనిపించిన కేసీఆర్.. ఇప్పుడు దుర్మార్గుడు అయ్యారా అని ఆయన ప్రశ్నించారు.

150 ఏళ్ల కాంగ్రెస్ వారెంటీ ఎప్పుడో అయిపోయిందని.. గ్యారెంటీ అంటూ కాంగ్రెస్ నేతలు కొత్త కొత్త డైలాగులు కొడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లు రూ.4 వేల పెన్షన్ ఇస్తామంటే నమ్ముదామా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో లో కమాండ్, బెంగళూరులో న్యూ కమాండ్.. ఢిల్లీలో హైకమాండ్.. ఇది కాంగ్రెస్ పరిస్ధితి అని కేటీఆర్ సెటైర్లు వేశారు. పరాములు నాయక్ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు. సండ్ర వీరయ్య మరోసారి భారీ విజయం సాధిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Latest Videos

click me!