ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదే..

Published : Sep 12, 2023, 04:36 PM IST
ఏపీలో పరిస్థితులపై తెలంగాణ మత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.  తెలంగాణకు చెందిన పలువురు నాయకులు కూడా ఈ అంశంపై స్పందిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.  తెలంగాణకు చెందిన పలువురు నాయకులు కూడా ఈ అంశంపై స్పందిస్తున్నారు. అయితే తాజాగా ఏపీ పరిణామాల గురించి మీడియా చిట్ చాట్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడానికి ఏం లేదని అన్నారు. పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పైన తమకు ఏలాంటి సంబంధం లేదని చెప్పారు. అది వారి తలనొప్పి అని.. తమకు సంబంధం లేదని  పేర్కొన్నారు. 

అలాగే తెలంగాణ రాజకీయాలపై కేటీఆర్ స్పందిస్తూ.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ అని.. ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదని అన్నారు. జాతీయ పార్టీలు ఢిల్లీ బానిస పార్టీలు  అని విమర్శించారు. ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరని అన్నారు. కేవీపీ రామచంద్రరావు, వైఎస్ షర్మిలలు, తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారని విమర్శించారు. 

Also Read: అప్పటిలోగా నోటిఫికేషన్ వస్తేనే.. : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి...కేవీపీ రామచందర్రావు... షర్మిల వంటి తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. పదేళ్లు సాధించిన అభివృద్ధిని, తెలంగాణ వ్యతిరేకుల చేతులు పెడదామా ప్రజలు తెలుసుకోవాల్సి ఉందన్నారు. కిషన్ రెడ్డి వెనక కిరణ్ కుమార్ రెడ్డి.. రేవంత్ రెడ్డి వెనక కేవీపీ రామచంద్రరావు ఉన్నారని  చెప్పుకొచ్చారు. 

తెలంగాణ ఉద్యమాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిన కేవీపీ రామచంద్రరావు ఈరోజు తెలంగాణ వాదిగా చెప్పుకోవడం తమ కర్మ అని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి అని విమర్శించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu