అప్పటిలోగా నోటిఫికేషన్ వస్తేనే.. : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

Published : Sep 12, 2023, 03:33 PM ISTUpdated : Sep 12, 2023, 03:52 PM IST
అప్పటిలోగా నోటిఫికేషన్ వస్తేనే.. : తెలంగాణ  అసెంబ్లీ  ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్ చాట్‌లో కేటీఆర్ మాట్లాడితే.. అక్టోబర్ 10వ తేదీలోపు కేంద్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్ణీత సమయంలో జరుగుతాయని అన్నారు. లేకపోతే తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చే  ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో అవకాశం ఉంటుందని అన్నారు. అయితే అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. ఆరు నెలల  తర్వాతే ఎన్నికలు ఉండొచ్చని చెప్పారు. 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై క్లారిటీ  వచ్చే అవకాశం ఉందన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ‌ ఎన్నికలు ఒక్కసారి వచ్చిన, వేర్వేరుగా  జరిగిన తమకు ఎలాంటి ఇబ్బంది  లేదని  అన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉందని అన్నారు. 90 స్థానాలకు పైగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అవసరం రాష్ట్రానికి ఉందని క్షేత్రస్థాయి నుంచి ప్రజల ఫీడ్ బ్యాక్ వస్తుందన్నారు. 

క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. పది సంవత్సరాలల్లో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారని అన్నారు. ప్రజలకు చాలా స్పష్టత ఉంది, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు. ప్రతిపక్షల తాపత్రయం రెండో స్థానం కోసమేనని సెటైర్లు వేశారు. 

సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వకుంటే వారి దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయని విమర్శించారు. తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఇచ్చారని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!