ఈటల రాజేందర్‌ను ఫోన్‌లో పరామర్శించిన మంత్రి కేటీఆర్

Published : Aug 25, 2022, 09:27 AM IST
ఈటల రాజేందర్‌ను ఫోన్‌లో పరామర్శించిన మంత్రి కేటీఆర్

సారాంశం

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తండ్రి మల్లయ్య అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో ఈటల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫోన్‌లో పరామర్శించారు.

మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తండ్రి మల్లయ్య అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో ఈటల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫోన్‌లో పరామర్శించారు. ఈటల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక, ట్విట్టర్ వేదికగా కూడా ఈటల మల్లయ్య మృతిపై కేటీఆర్ సంతాపం తెలిపారు. ఈటల రాజేందర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నట్టుగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. ఇందుకు రిప్లై ఇచ్చిన ఈటల రాజేందర్ ‘‘థాంక్యూ కేటీఆర్ గారు’’ అని పేర్కొన్నారు. 

ఈటల మల్లయ్యకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. రాజేందర్‌ రెండో కుమారుడు. మల్లయ్య కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆర్వీఎం ఆస్పత్రి, మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించి మంగళవారం అర్దరాత్రి మృతి చెందారు. మల్లయ్య మృతివార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు, బీజేపీ నాయకులు ఈటల రాజేందర్‌ను ఫోన్‌లో పరామర్శించారు.

 

మల్లయ్య భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం  ఆస్పత్రి నుంచి స్వగ్రామమైన హన్మకొండ జిల్లా కమలాపూర్‌కు తరలించారు. అక్కడ పలువురు మల్లయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కమలాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!