జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి కేటీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కోరారు.
హైదరాబాద్: జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కేటీఆర్ కోరారు.ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో మంగళవారంనాడు మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.
జనగామ అసెంబ్లీ స్థానం నుండి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టిక్కెట్టును బీఆర్ఎస్ ప్రకటించలేదు. జనగామ, నాంపల్లి, గోషామహల్, నర్సాపూర్ అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. జనగామ అసెంబ్లీ స్థానం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఆర్టీసీ చైర్ పర్సన్ పదవిని కట్టబెట్టింది. గత వారంలోనే ఆర్టీసీని చైర్ పర్సన్ పదవిని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేపట్టారు. గతంలో ఆర్టీసీ చైర్ పర్సన్ గా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ పదవీ కాలం పూర్తి కావడంతో ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డికి ఈ పదవిని కేటాయించారు కేసీఆర్.
జనగామ అసెంబ్లీ స్థానం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ దఫా బరిలోకి దిగనున్నారు.జనగామ నుండే బరిలోకి దిగుతానని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గతంలో ప్రకటించారు. జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలతో పల్లా రాజేశ్వర్ రెడ్డి గతంలో రహస్యంగా సమావేశమయ్యారు. దీనికి పోటీగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడ సమావేశాలు నిర్వహించారు. జనగామ టిక్కెట్టు తనకే ఇవ్వాలని కోరారు. అయితే ఆర్టీసీ చైర్ పర్సన్ పదవిని కట్టబెట్టి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని బుజ్జగించారు.