కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే.. బీఆర్ఎస్‌దే కీలక పాత్ర: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 12, 2023, 03:45 PM IST
కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే.. బీఆర్ఎస్‌దే కీలక పాత్ర: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ . ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్‌దే కీలకపాత్ర అని మంత్రి చెప్పారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. శనివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేంద్రంలో వచ్చే ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకంగా వుంటుందన్నారు. అంతకుముందు పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

కేసీఆర్‌కు నేతన్నల కష్టం తెలుసునని.. అందుకే చేనేత మిత్ర పేరుతో నూలు, రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి అన్నారు. నేతన్నకు చేయూత పేరిట పొదుపు పథకం తీసుకొచ్చామని.. రైతు బీమా తరహాలోనే నేతన్నకు బీమా తెచ్చామని కేటీఆర్ గుర్తుచేశారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసి దానిని తిరిగి తెరుస్తామని మంత్రి చెప్పారు. 

ALso Read: దేశంలోనే తొలి అగ్రికల్చర్ డేటా ఎక్స్ఛేంజ్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

శనివారం దేశంలోనే తొలి అగ్రికల్చరల్ డేటా ఎక్స్ఛేంజ్ (ఏడీఎక్స్)ను హైదరాబాద్ లో ప్రారంభించారు కేటీఆర్. వ్యవసాయ రంగానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)గా అభివృద్ధి చేసిన ఏడీఎక్స్ తెలంగాణ ప్రభుత్వం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ భాగస్వామ్యంతో రూపొందింది. పరిశ్రమలు, స్టార్టప్ లు వ్యవసాయ డేటాను నిష్పాక్షికంగా, సమర్థంగా వినియోగించుకునేలా చూసేందుకు ఏడీఎక్స్ , ఏడీఎంఎఫ్ లు సరైన వేదికను కల్పిస్తున్నాయనీ మంత్రి చెప్పారు.

ముఖ్యంగా ఆర్జీఐ రంగంలో డేటా ఎకానమీకి పెద్ద ఊతమిచ్చాయన్నారు కేటీఆర్. ఆహార వ్యవస్థల పరివర్తనకు, రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో తెలంగాణ ముందుండి నడిపించడానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు