ఐటీఐఆర్ బాటలో ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, తెలంగాణకు మరో అన్యాయం: కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం

By Siva KodatiFirst Published Mar 4, 2021, 7:02 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదన్నట్లుగా వస్తున్న వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైరయ్యారు. తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదన్నట్లుగా వస్తున్న వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైరయ్యారు. తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు.

ఐటీఐఆర్ లాగే ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మంగళం పాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలు మార్లు కేంద్రాన్ని కోరామని మంత్రి స్పష్టం చేశారు.

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని రద్దు చేసే అధికారం కేంద్రానికి లేదన్నారు కేటీఆర్. రైల్వేలను ప్రైవేట్ పరం చేయడం జాతి వ్యతిరేక చర్యనే అన్నారు మంత్రి. బుల్లుట్ రైలు  అంటూ గొప్పులు చెప్తూ.. తెలంగాణకు మొండిచేయి చూపారని ఆయన మండిపడ్డారు. 

ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని, లేఖలు రాసిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.

మరోవైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన అన్ని ప్రయత్నాలను తాము చేస్తూనే ఉన్నామని మంత్రి వెల్లడించారు. దీనిలో భాగంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అవసరమైన స్థల సేకరణ కూడా పూర్తయిందని కేటీఆర్ తెలిపారు.

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అత్యంత విలువైన 150 ఎకరాల భూమిని ప్రత్యేక శ్రద్ధతో మరో ప్రభుత్వ శాఖ నుంచి సేకరించి కేంద్ర రైల్వే శాఖకు అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.  

click me!