సంక్రాంతికి ముందే గంగిరెద్దుల హడావిడి: మహాకూటమిపై కేటీఆర్

By Nagaraju TFirst Published Dec 3, 2018, 3:14 PM IST
Highlights

మహాకూటమిపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు గుంపులుగా వస్తున్నాయని విమర్శించారు. 
 

ఉట్నూర్‌: మహాకూటమిపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు గుంపులుగా వస్తున్నాయని విమర్శించారు. 

సంక్రాంతికి ముందే గంగిరెద్దులా మహాకూటమి అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో 3వేల 400 తండాలు, గూడేలను పంచాయితీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని కేటీఆర్ చెప్పారు. ఒకప్పుడు ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడేవారని, కానీ నేడు 35 శాతానికి పైగా ప్రజలు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 12 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ రూ.200 పెన్షన్ ఇస్తే దాన్ని వెయ్యి రూపాయలుకు పెంచామని ఇప్పుడు రూ.2000కు పెంచుతున్నట్లు తెలిపారు. 

ఖానాపూర్ నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మిగతా పార్టీల బాసులు ఢిల్లీలో, అమరావతిలో ఉంటే టీఆర్ఎస్ బాసులు మాత్రంం గల్లీల్లో ఉంటారని స్పష్టం చేశారు. కేసీఆర్ పై దుష్ప్రచారం చేస్తున్న పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 

మరోవైపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం గీసుకోకుంటే తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాశనం చేసిన తెలంగాణను ఇప్పుడిప్పుడే బాగు చేసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్ర ప్రజలను గాలికి వదిలేసి తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు టీఆర్‌ఎస్‌ మేలు చేసిందని  కేటీఆర్ తెలిపారు. 

click me!