కూరగాయలు అమ్మిన మంత్రి జోగురామన్న

Published : Oct 24, 2018, 10:50 AM IST
కూరగాయలు అమ్మిన మంత్రి జోగురామన్న

సారాంశం

పట్టణంలోని ఇంటింటికీ తిరుగుతూ తనను మరోసారి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కారు గుర్తుకే ఓటు వేయాలంటూ కోరుకున్నారు. 

తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్వం మొదలైంది. తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న మంగళవారం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ ఛైర్మన్ మనీషాతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు.

మొదట పట్టణంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని జోగురామన్న ప్రారంభించారు. పట్టణంలోని ఇంటింటికీ తిరుగుతూ తనను మరోసారి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కారు గుర్తుకే ఓటు వేయాలంటూ కోరుకున్నారు. 

ప్రచారంలో భాగంగా కూరగాయలు కూడా అమ్మారు. కూరగాయల బండిని తోలుతూ.. ఇంటింటికీ వెళ్లి కూరగాయాల అమ్మకాలు చేపట్టారు. మహిళలు, వృద్ధులను పేరు పేరునా పలకరిస్తూ.. తనను గెలిపించాలని కోరారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? మిర్చీ హాఫ్ సెంచరీ..? : హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త