సొంత నేతలపై దూషణలు.. ప్రత్యర్ధి పార్టీపై పొగడ్తలు, ఆయనది పూటకో మాట : కోమటిరెడ్డికి జగదీశ్ రెడ్డి చురకలు

Siva Kodati |  
Published : Jul 24, 2022, 05:50 PM IST
సొంత నేతలపై దూషణలు.. ప్రత్యర్ధి పార్టీపై పొగడ్తలు, ఆయనది పూటకో మాట : కోమటిరెడ్డికి జగదీశ్ రెడ్డి చురకలు

సారాంశం

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి జగదీశ్ రెడ్డి చురకలు వేశారు. ఆయన సొంత పార్టీ నాయకులను దూషించి ... అవతలి పార్టీని పొగిడే నాయకుడంటూ మంత్రి సెటైర్లు వేశారు. 

కాంగ్రెస్ (congress) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై (komatireddy rajagopal reddy) మంత్రి జగదీశ్ రెడ్డి (jagadish reddy) ఫైరయ్యారు. 2018లో అంతర్గత పొరపాటు కారణంగా మునుగోడులో ఓడిపోయామని ఆయన అన్నారు. సొంత పార్టీ నాయకులను దూషించి ... అవతలి పార్టీని పొగిడే నాయకుడు రాజగోపాల్ రెడ్డి అంటూ జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. కళ్యాణ లక్ష్మీ చెక్కులు ఆయన పంచకపోవడంతో బౌన్స్ అయ్యాయని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేకు చెక్కులు పంచే తీరిక లేకపోవడంతో తాను పంచుతున్నానని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ పనుల్లో బిజీగా వున్నారని.. గత 6 నెలలుగా నియోజకవర్గంలో సైతం తిరగడం లేదని మంత్రి ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి పూటకొక మాట మాట్లాడుతున్నారని.. పూటకో మాట మాట్లాడే ఎమ్మెల్యేతో జరిగేది ఏం లేదని జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అడ్డుకోవడంతోనే గట్టుప్పల మండలం ఆలస్యమైందని మంత్రి ఆరోపించారు. 

అంతకుముందు పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. KCR కుటుంబంపై తాను రాజీలేని పోరాటం చేస్తున్నట్టుగా  రాజగోపాల్ రెడ్డి తెలిపారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపంచారు. తమ పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని రాజగోపాలల్ రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యకర్తలతో చర్చించకుండా తానే ఏ నిర్ణయం తీసుకోనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. TRS  నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ అవినీతిపై బహిరంగ యుద్ధం చేస్తున్నట్టుగా రాజగోపాల్ రెడ్డి వివరించారు. 

ALso REad:పార్టీ మారడం చారిత్రక అవసరం: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తాను గతంలో బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేసిన మాట వాస్తవమేనన్నారు.కానీ, బీజేపీలో చేరిక గురించి ఎప్పుడూ కూడా ప్రకటించలేదన్నారు. తనకు నిలకడ ఉంది కాబట్టే కాంగ్రెస్ లో ఉన్నానని ఆయన చెప్పారు.కాంగ్రెస్ పార్టీ బాగుపడాలనే ఉద్దేశ్యంతోనే తాను కొన్ని మాటలు మాట్లాడినట్టుగా ఆయన వివరించారు. తాను రాజీనామా చేయాలనుకోవడం లేదని తేల్చి చెప్పారు.

తాను పార్టీ మారాల్సి వస్తే ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకొంటానని ప్రకటించారు. టీఆర్ఎస్ ఉసిగొల్పితే ఎన్నికలకు వెళ్లబోనని కూడా ఆయన స్పష్టం చేశారు. అమిత్ షాను కలిసినందున తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీఆర్ఎస్ కు చెందిన మీడియాలో ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తనను గెలిపించిన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోనని ఆయన తెలిపారు. ఏం చేసినా కూడా తాను తన నియోజకవర్గ ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకొంటానన్నారు. తనకు అన్ని పార్టీల్లో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలుంటారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకొన్న నిర్ణయాల వల్ల  పార్టీ బలహీనపడిందన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu