ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కు నయా పైసా ఇవ్వలేదు.. జేపీ నడ్డాపై హరీష్ రావు ఫైర్

Published : Oct 20, 2022, 02:26 PM IST
ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కు నయా పైసా ఇవ్వలేదు.. జేపీ నడ్డాపై హరీష్ రావు ఫైర్

సారాంశం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2016లో జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ పర్యట సందర్భంగా  ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2016లో జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నల్గొండ పర్యట సందర్భంగా  ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఈ మేరకు హరీష్ రావు ట్విట్టర్‌‌లో పోస్టులు చేశారు. ‘‘2016లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా.. మీరు పర్యటిస్తూ, ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తమన్నరు. మీరు హమీ ఇచ్చి ఆరేళ్లయింది. ఈ సెంటర్ ఏర్పాటు కోసం 8.2 ఎకరాల స్థలం చౌటుప్పల్ లో  తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది’’ అని హరీష్ రావు చెప్పారు. 

‘‘ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కు నయా పైసా ఇవ్వలేదు. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తమని కూడా హమీ ఇచ్చారు. అబద్దపు హమీలిస్తూ, ప్రజా గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం మోహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నరు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ది చెప్పడం ఖాయం’’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు. 

 

ఇదిలా ఉంటే.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడి తరపున హరీష్ రావు ప్రచారం కొసాగిస్తున్నారు. బుధవారం మర్రిగూడ మండలం రాజాపేట తండాలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో ఆసరా పెన్షన్ రూ.3వేలకు పెంచుతామని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో సహా, బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ ఇస్తున్న పెన్షన్ కేవలం రూ.600 మాత్రమేనన్నారు. బీజేపీ నేతల తప్పుడు వాగ్దానాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన రైతుబంధు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరించాయని అన్నారు.

మునుగోడులో దశాబ్దాలుగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని కూడా సీఎం కేసీఆర్ నెరవేర్చారన్నారు. మిషన్ భగీరథ కింద మునుగోడులో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు.. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడంలో కేంద్రం సహకారం ఏమైనా ఉంటే బీజేపీ నేతలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. మరోవైపు మిషన్‌ భగీరథ కోసం రూ. 19 వేల కోట్ల నిధుల కోసం నీతి ఆయోగ్‌ కేంద్రానికి సిఫారసు చేసినా.. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని మండిపడ్డారు. కేవలం మిషన్ భగీరథ మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకానికి కేంద్రం ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదని విమర్శించారు.

శివన్నగూడెం రిజర్వాయర్‌ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హరీష్ రావు హామీ  ఇచ్చారు. దీంతో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ను తొలగించేందుకు  వీలుంటుందన్నారు. గత 8 ఏళ్లుగా కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న సమస్యను కేంద్రం పరిష్కరించడం లేదని విమర్శించారు.  కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటాను వెంటనే ఖరారు చేయాలని కేంద్రాన్ని కోరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?