Minister Harish Rao:"అగ్నిప‌థ్ తో యువత ఆశలపై నీళ్లు చల్లారు".. బీజేపీ పై మంత్రి హరీశ్ రావు ఫైర్

Published : Jul 19, 2022, 06:28 PM IST
Minister Harish Rao:"అగ్నిప‌థ్ తో యువత ఆశలపై నీళ్లు చల్లారు"..  బీజేపీ పై మంత్రి హరీశ్ రావు ఫైర్

సారాంశం

Minister Harish Rao:  కేంద్ర‌ప్ర‌భుత్వంపై మ‌రోసారి తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డంతో మోడీ స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు.

Minister Harish Rao:  కేంద్ర‌ప్ర‌భుత్వంపై మ‌రోసారి తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డంతో మోడీ స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు. కులం, మతం పేరిట చిచ్చు పెట్టి..  లబ్ధి పొందాలనే యోచన తప్ప.. బీజేపీ పాల‌కులు చేసింది ఏం లేద‌ని, ఎమోషన్స్ తో రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
 
ఈ క్ర‌మంలో స్థానిక బీజేపీ నేత‌ల‌ను నిలాదీశారు. ఏం ముఖం పెట్టుకొని గ్రామాల్లో తిరుగుతారనీ, మిమ్మల్ని చూస్తే గొస అనిపిస్తున్నదని ఏద్దేవా చేశారు. యువత కోసం బిజెపి ఏం చేసిందని ప్ర‌శ్నించారు. యువ‌త కూడా ఈ విష‌యంలో బాగా ఆలోచించాల‌నీ, బీజేపీ నేత‌ల‌ మాటలు కోటలు దాటుతాయని,  కేంద్రం ప్ర‌భుత్వం చేసింది ఏం లేదనీ,  చేసేది కూడా ఏం లేదని అన్నారు. ఉద్యోగాలు ఇస్తున్నది తెరాస‌ అయితే...ఉన్నవి ఉద్యోగాల‌ను ఊడగొడితున్నది బీజెపీ అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

 ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం 50 వేల మంది ఉద్యోగాలు తొలగించింద‌నీ, 16.50 లక్షల ఖాళీలు ఉన్నా నింపడం లేదని అన్నారు. కేంద్రంలో 3 లక్షలు ఉన్నాయనీ, ఆర్మ్డ్ రిజర్వ్ లో 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయనీ, అవి నింపితే మా తెలంగాణ యువతకు కొందరికైనా ఉద్యోగాలు వ‌స్తాయ‌ని అన్నారు. 

మ‌రోవైపు.. మిలటరీలో చేరాల‌నే యువ‌త‌ ఆశల మీద నీళ్లు చల్లారనీ, అగ్నిపథ్ పేరిట యువత జీవితాలతో కేంద్రం ఆటలాడుతున్నదనీ, ఇలాంటి ప‌థ‌కాల ద్వారా యువత శక్తి నిర్వీర్యం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.  

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్ చెరులో పోలీసు ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. స్థానిక పిల్లలకు ఉద్యోగాలు రావాలని సీఎం కేసీఆర్ 95శాతం రిజర్వేషన్ కల్పించారు. మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 91 వేల ఉద్యోగాల నియామకాలు చేస్తున్నాము. యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే