సిద్దిపేట నుండి నామినేషన్ దాఖలు చేసిన హరీష్...

By Arun Kumar PFirst Published Nov 14, 2018, 4:07 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి హేమాహేమీలంతా తుది పోరుకు సిద్దమవుతున్నారు. ఎన్నికల నోటిపికేషన్ వెలువడి రెండు రోజులవుతున్నా ఇప్పటివరకు చాలా తక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇక ఇవాళ మంచి మూహూర్తం ఉండటంతో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక సీఎం మేనల్లుడు, మంత్రి హరీష్ రావు కూడా సిద్దిపేట నుండి నామినేషన్ దాఖలు చేశారు. 

సిద్దిపేట లోని తన స్వస్థలం నుండి కొంతమంది నాయకులతో కలిసి హరీష్ నామినేషన్ కోసం బయలుదేరారు. మొదట సిద్దిపేట పట్టణంలోని ఈద్గా, చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నేరుగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.  ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సెన్ పాటు మరికొందరు స్థానిక నాయకులతో కలిసి మంత్రి నామినేషన్ పత్రాలను అధికారికి అందించారు.  

మరిన్ని వార్తలు   

 గజ్వేల్ నుండి కేసీఆర్ నామినేషన్ దాఖలు (ఫోటోలు)

గజ్వేల్ నుండి కేసీఆర్ నామినేషన్ దాఖలు

click me!