లీక్ చేసిన దొంగలంతా జైల్లోనే.. అందుకే ఇవాళ పరీక్షలు ప్రశాంతం : బండి సంజయ్‌పై హరీశ్‌రావు పరోక్ష వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 06, 2023, 03:00 PM IST
లీక్ చేసిన దొంగలంతా జైల్లోనే.. అందుకే ఇవాళ పరీక్షలు ప్రశాంతం : బండి సంజయ్‌పై హరీశ్‌రావు పరోక్ష వ్యాఖ్యలు

సారాంశం

పేపర్ లీక్ చేసిన దొంగలంతా జైల్లో వుండటంతో ఇవాళ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. బండి సంజయ్ సమాధులు తవ్వుతా అంటే.. రేవంత్ రెడ్డి కూలగొడతా, కాలుపెడతానని అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణలో సంచలనం సృష్టించిన పేపర్ లీక్ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ చేసిన దొంగలంతా జైల్లో వుండటంతో ఇవాళ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని చురకలంటించారు. బీఆర్ఎస్ పార్టీ పిల్లలకి ఉచితంగా చదువు చెబితే.. బీజేపీ మాత్రం పేపర్లు లీక్ చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ గొడవలు పెట్టాలని చూస్తోందని ఆయన విమర్శించారు. బండి సంజయ్ సమాధులు తవ్వుతా అంటే.. రేవంత్ రెడ్డి కూలగొడతా, కాలుపెడతానని అంటున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు తెలంగాణకు అవసరమా అని మంత్రి ప్రశ్నించారు. బీజేపీది దేశభక్తి కాదని.. కపట మొక్కులని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీపై కేసు వేసినా సోనియా గాంధీని తిట్టినా కాంగ్రెస్ ఏం చేయలేకపోయిందని హరీశ్ రావు పేర్కొన్నారు. 

ఎయిమ్స్‌లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజ్ వస్తే మోడీ ఇప్పుడు కొబ్బరికాయ కొడతారా అంటూ హరీశ్ రావు చురకలంటించారు. మోడీ వస్తున్నారని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. ఒక్క మెడికల్ కాలేజీకే ఇంత చేస్తే, తమ ప్రభుత్వం ఒకేసారి 8 మెడికల్ కాలేజీలకు కొబ్బరికాయ కొట్టిందన్నారు. బీజేపీది పని తక్కువ, ప్రచారం ఎక్కువన్నారు. తమది చేతల ప్రభుత్వమని.. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో చేయని పనులను కేసీఆర్ 8 ఏళ్లలోనే పూర్తి చేశారని హరీశ్ రావు ప్రశంసించారు. 

Also Read: భయపడేది లేదన్నారు.. ఆయన బాధల్లా ఒక్కటే..: జైలులో బండి సంజయ్‌ను కలిసిన ఆయన భార్య..

ఇదిలావుండగా.. తెలంగాణలో పదో తరగతి పరీక్షల లీకేజీ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో విద్యార్థుల సమస్య కాస్త బిఆర్ఎస్ వర్సెస్ బిజెపిగా మారింది. టెన్త్ ప్రశ్నపత్రాలతో పాటు ఇటీవల టీఎస్ పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీ కూడా బిజెపి పనేనని బిఆర్ఎస్... తమ అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ సర్కార్ తమను బద్నాం చేస్తోందని బిజెపి అంటోంది. ఈ పేపర్ల లీకేజీపై ఇరు పార్టీల నాయకులు మీడియాముందుకు వచ్చి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఈ టెన్త్ పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీ, బండి సంజయ్ అరెస్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో చోటుచేసుకుంటున్న పేపర్ల లీకేజీలు ముమ్మాటికీ బీజేపీ పనేనని మంత్రి ఆరోపించారు. ఈ లీకేజీ వెనక "నమో" కుట్రలు వున్నాయన్నారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న బండి సంజయ్ బిజెపి అధ్యక్షుడు కాగా ఏ2 గా ఉన్న ప్రశాంత్ బీజేపీ సంస్థ "నమో" పార్లమెంటరీ కమిటీ కన్వీనర్ అని మంత్రి పేర్కొన్నారు. వీరిద్దరు కలిసి పథకం ప్రకారమే పేపర్ల లీకేజీకి కుట్రలు పన్ని నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మంత్రి ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?