ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని.. ఈటల గెలిస్తే రాష్ట్రంలో బిజెపికీ ఒక ఎంఎల్ఏ పెరుగుతాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి గంగుల కమలాకర్. ఈటల ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేటీకరణ చేస్తున్నందుకు బీజెపీలో కలిశారా అని ఈటల రాజేందర్‌ను నిలదీయాలని ఆయన ప్రజలకు సూచించారు. త్వరలో రాష్ట్రం లో అరవై వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఖాళీ ఉన్న ఉద్యోగుల భర్తీ చేస్తామని గంగుల తెలిపారు.
Also Read:హుజురాబాద్ ఉపఎన్నిక మరింత రసవత్తరం... పోటీలో ఈటల సతీమణి జమున?
ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని కమలాకర్ ఆరోపించారు. టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని.. ఈటల గెలిస్తే రాష్ట్రంలో బిజెపికీ ఒక ఎంఎల్ఏ పెరుగుతాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బిసి శాఖ ఇవ్వమని ఎందుకు అడుగలేదని గంగుల ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని.. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని మంత్రి పిలుపునిచ్చారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో అక్రమ కేసులతో ఈటల రాజేందర్ అనేక ఇబ్బందులు పెట్టారంటూ ఆయన ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని మంత్రి గంగుల ప్రశ్నించారు.