ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరుకానున్న మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ గాయత్రి రవి...

By SumaBala BukkaFirst Published Dec 1, 2022, 10:38 AM IST
Highlights

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ గాయత్రి రవిలు నేడు ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు బుధవారం గంగులకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

కరీంనగర్ : తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి నేడు ఢిల్లీలో సిబిఐ ఆఫీస్ లో విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే సీబీఐ అధికారులు గంగుల కమలాకర్ కు ఈ మేరకు నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.  డిసెంబర్ 1, గురువారం ఢిల్లీకి రావాలని ఆదేశించారు. నకిలీ సీబీఐ అధికారి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ ను ఢిల్లీలోని తమిళనాడు భవన్లో నాలుగు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గంగులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఇటీవల సీబీఐ అధికారి పేరుతో ఓ వ్యక్తి తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు పలువురని కలిశాడు. శ్రీనివాస్ అనే ఆ వ్యక్తి గంగుల కమలాకర్ తో దిగిన ఫోటో వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు పలు అంశాలు వెలుగు చూశాయి. అయితే, దర్యాప్తులో అతను సీబీఐ అధికారి కాదని. నకిలీ సీబీఐ అధికారి అని తేలింది. దీంతో సీబీఐ అతని మీద కేసు నమోదు చేసింది. ఈ కేసులో మంత్రి గంగుల కమలాకర్ ను సీబీఐ సాక్షిగా చేర్చింది.

మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవిలకు సీబీఐ నోటీసులు.. ఢిల్లీలో విచారణకు రావాలని ఆదేశం..

దీంతో ఆయనతో పాటు. ఎంపీ రవిచంద్ర అలియాస్ గాయత్రి రవిని విచారించనుంది సీబీఐ. ఈ కేసులో  సీబీఐ అధికారులు సాక్షులుగా  గంగుల కమలాకర్ ను విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలోనే.. టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన కూడా ఈ రోజు ఢిల్లీలో సిబిఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. 

ఇదిలా ఉండగా, నిన్న తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి సీబీఐ అధికారులు వచ్చారు. సీబీఐ నకిలీ అధికారి శ్రీనివాస్ అరెస్టు పై నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని గంగులకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గంగుల వాంగ్మూల నమోదు చేసేందుకు అధికారులు నిన్న కరీంనగర్ లోని గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లారు. సీనియర్ ఐపిఎస్ అధికారుల పేర్లు చెప్పి మోసానికి పాల్పడుతున్నట్లు శ్రీనివాస్ విచారణలో పేర్కొన్నాడు. 

దీంతో, మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. మంత్రి గంగులకమలాకర్ కు శ్రీనివాస్ తో ఎప్పటినుంచి పరిచయం ఉంది? ఎప్పుడు కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? అనే కోణంలో సీబీఐ విచారించనుంది. మంత్రి గంగులతో పాటు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపి గాయత్రిరవికిగా కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.  శ్రీనివాస్ తో మంత్రి గంగుల కమలాకర్ కు ఉన్న సంబంధాల పై సిబిఐ విచారించింది. 

click me!