ధాన్యం కొనుగోలు.. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటల నమ్మొద్దు : రైతాంగానికి మంత్రి ఎర్రబెల్లి సూచన

Siva Kodati |  
Published : May 12, 2023, 03:03 PM IST
ధాన్యం కొనుగోలు.. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటల నమ్మొద్దు : రైతాంగానికి మంత్రి ఎర్రబెల్లి సూచన

సారాంశం

ధాన్యం కొనుగోలుకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు నమ్మొద్దన్నారు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ తరహా పథకాలు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఎర్రబెల్లి తెలిపారు.

కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డారు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ఏం మాట్లాడతారో తెలియదన్నారు. 60 ఏళ్లకు ముందు తెలంగాణ ఎలా వుండేది, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎలా వుందని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్నదే కేసీఆర్ అభిమతమన్నారు. అందుకే ఆయనే స్వయంగా పర్యటనలు చేస్తున్నారని దయాకర్ రావు తెలిపారు.

కాంగ్రెస్ పాలనలో వున్న ఛత్తీస్‌గఢ్‌లో రైతులకు 5 వేల నష్టపరిహారం కూడా ఇవ్వలేదని.. తెలంగాణలో మాత్రం ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు. వర్షాలకు ధాన్యం పాడవకుండా వుండేందుకు గాను 1.30 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు పూర్తి చేశారని మంత్రి వెల్లడించారు. తెలంగాణ తరహా పథకాలు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఎర్రబెల్లి తెలిపారు. తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని కేసీఆర్ ఆదేశించారని.. కాంగ్రెస్, బీజేపీల దొంగ మాటలను నమ్మొద్దని ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. 

అంతకుముందు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీ  బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు. పేపర్ లీక్ చేసి 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. పేపర్ లీక్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

Also Read: తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. బండి సంజయ్

సంగారెడ్డిలో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ.. పేపర్ లీక్‌‌తో నష్టపోయిన అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని విమర్శించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.  టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌ ఘటనకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రెండు లక్షల ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పారు. తమ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాల ఖాళీల వివరాలతో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రిక్రూట్‌మెంట్ చేపడతామని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం