ఫ్లాట్‌ను పేకాట క్లబ్‌గా మార్చి...

Published : Nov 06, 2018, 08:08 AM ISTUpdated : Nov 06, 2018, 08:14 AM IST
ఫ్లాట్‌ను పేకాట క్లబ్‌గా మార్చి...

సారాంశం

ఇంటిని పేకాట క్లబ్‌గా మార్చి గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు కాచిగూడ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే కాచిగూడకు చెందిన సరోజ్ తన భర్త హరిబాబుతో కలిసి బర్కత్‌పురాలోని శాలిని హస్పిటల్‌కు ఎదురుగా ఉన్న స్కిల్ లెజెన్సీ అపార్ట్‌మెంటును అద్దెకు తీసుకున్నారు.

ఆ తర్వాత దానిని మినీ పేకాట క్లబ్బుగా మార్చేసి గ్యాంబ్లింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మూడు ముక్కలాట జోరుగా సాగుతుందంటూ స్థానికులు సమాచారం ఇవ్వడంతో... సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి సదరు ఫ్లాట్‌పై దాడులు నిర్వహించి.. పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ.11,670 నగదు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితురాలు సరోజ్ పరారీలో ఉందని.. ఆమె కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌