ముందస్తు ఎఫెక్ట్... టీఆర్ఎస్ తర్వాత ఆ పని చేసింది మజ్లీసే...

By Arun Kumar PFirst Published 11, Sep 2018, 3:09 PM IST
Highlights

తెలంగాణ లో ముందస్తు ఎన్నికల కోసం పార్టీలన్నీ సిద్దమవుతున్నాయి. అయితే ప్రతిపక్షాలు ఇంకా పొత్తులు, అభ్యర్థుల ఎంపిక వంటి వాటితో సతమతమవుతుంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రం 105 మంది అభ్యర్థులను ప్రకటించిన సంచలనం రేపింది. తాజాగా అదే బాటలో నడుస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన రెండో పార్టీగా ఎంఐఎం నిలిచింది.

ఆల్ ఇండియా మజ్లీస్-ఇ-ఇత్తేహాదుల్ ముస్లీమిన్ (ఏఐఎంఐఎం) పార్టీకి హైదరాబాద్ లో మంచి పట్టుంది. కేవలం సిటీ పరిధిలో ఈ పార్టీకి గతంలో ఏడుగురు ఎమ్మెల్యేల బలం ఉంది.  అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పార్టీ ముందుగానే స్పందించింది. ముందస్తు ఎన్నికల్లో మళ్లీ సిట్టింగ్ లకే అవకాశం కల్పిస్తూ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. 

చాంద్రాయణగుట్ట నుండి మాజీ ప్లోర్ లీడర్ అక్బరుద్దిన్ ఓవైసీ, యాకుత్‌పుర అభ్యర్థిగా సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ, చార్మినార్ లో ముంతాజ్ అహ్మద్‌ఖాన్, బహదూర్‌పుర అభ్యర్థిగా మహ్మద్ మొజంఖాన్, మలక్‌పేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్‌బిన్ అబ్దుల్లా బలాల, నాంపల్లి అభ్యర్థిగా జాఫర్ హుస్సేన్ మేరాజ్, కార్వాన్ లో కౌసర్ మొహిద్దీన్ లు ఎంఐఎం పార్టీ నుండి బరిలోకి దిగనున్నారు. ఇలా మొదటి విడతగా తమకు పట్టున్న ప్రాంతాల్లో అభ్యర్థులను ప్రకటించిన ఈ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తదుపరి మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నారు.

ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం కు మధ్య ప్రెండ్లీ పోటీ ఉంటుందని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తమ స్థానాలను కాపాడుకుంటునే రాష్ట్రంలో పట్టున్న స్థానాల్లో అభ్యర్థులకు నిలిపి మిగతా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులకు సహకరించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Last Updated 19, Sep 2018, 9:22 AM IST