బెజవాడలో కేసిఆర్ కు పాలాభిషేకం ఎలా జరిగిందంటే ? (వీడియో)

Published : Jan 09, 2018, 12:03 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
బెజవాడలో కేసిఆర్ కు పాలాభిషేకం ఎలా జరిగిందంటే ? (వీడియో)

సారాంశం

బెజవాడలో యాదవుల హల్ చల్ త్వరలో హైదరాబాద్ వచ్చి కేసిఆర్ కు సన్మానం చేస్తాం

తెలంగాణలో యాదవులకు ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సీటు ఇస్తామని ప్రకటించినందుకు సీమాంధ్ర యాదవులు పొంగిపోయారు. ఏకంగా కేసిఆర్ చిత్రపటానికి బెజవాడ కేంద్రంగా పాలాభిషేకం చేశారు. యాదవ యువ భేరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. కేసిఆర్ ఫొటోకు పాలు, పూలతో అభిషేకం చేశారు.

యాదవుల అభ్యున్నతికి కేసిఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ యాదవులకు సబ్సిడీ గొర్రెలు పంపిణీ చేసి యాదవ బాంధవుడుగా మారిపోయిండని ఖితాబిచ్చారు. యాదవులకు 200 కోట్లతో భవనం నిర్మించి ఇస్తామని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

త్వరలోనే హైదరాబాద్ కు పోయి కేసిఆర్ కు ప్రత్యేక సన్మానం చేస్తామని యాదవ యువ భేరి నేతలు ప్రకటించారు. యాదవుల పాలాభిషేకం వీడియో కింద చూడొచ్చు.

 

 

 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఒక్కొక్కరు ఇంత మందు తాగుతున్నారా..! ఇందుకోసం ఇంత ఖర్చు చేస్తున్నారా..!!
Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు