నిత్యావసర సరుకుల కోసం.. వలస కార్మికుల ప్లాన్.. ఫోన్ చేసి..

By telugu news team  |  First Published Apr 20, 2020, 9:55 AM IST

ఎల్బీనగర్‌లో తమ రాష్ట్రానికి చెందిన 30 మంది కార్మికులు నివసిస్తున్నారని, లాక్‌డౌన్‌ కారణంగా పస్తులుంటున్నారని, వారిని ఆదుకోవాలంటూ రెండు రోజుల క్రితం హరియాణాకు చెందిన ఐఏఎస్‌ అధికారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అందింది. దాంతో మన ప్రభుత్వం సత్వరమే స్పందించింది. 
 


కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ విధించినా కేసులు పెరుగుతుండటంతో.. లాక్ డౌన్ మళ్లీ కొనసాగించారు. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా ఎక్కువగా వలస కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారి గురించి వార్తల్లో రోజుకో కథనం వెలువడుతోంది.

ఈ క్రమంలో.. వారిని ఆదుకునేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. వారికి నిత్యవసర సరుకులు అందిస్తూ.. వారి బాగోగులు చూసుకుంటున్నారు. అయితే.. హైదరాబాద్ నగరంలోని కొందరు వలస కార్మికులు చేసిన ఓ పని తో అధికారులు షాకయ్యారు.

Latest Videos

undefined

ఇంతకీ మ్యాటరేంటంటే... పాతబోయినపల్లి ఎల్బీనగర్‌లో తమ రాష్ట్రానికి చెందిన 30 మంది కార్మికులు నివసిస్తున్నారని, లాక్‌డౌన్‌ కారణంగా పస్తులుంటున్నారని, వారిని ఆదుకోవాలంటూ రెండు రోజుల క్రితం హరియాణాకు చెందిన ఐఏఎస్‌ అధికారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి అందింది. దాంతో మన ప్రభుత్వం సత్వరమే స్పందించింది. 

ఓ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో కొందరు అధికారులను రంగంలోకి దింపింది. బోయినపల్లి పోలీసుల సహకారంతో వారు శుక్రవారం రాత్రి ఆ కార్మికులు ఉంటున్న ఇళ్లకెళ్లి అక్కడ ఉన్న 22 మందిని గుర్తించారు. అయితే వారి గదుల్లో కనీసం మూడు నెలలకు సరిపడా నిత్యావసరాలు ఉండడాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఈ విషయమై కార్మికులను అడగ్గా వారు చెప్పిన సమాధానాన్ని విని మరోసారి విస్తుపోయారు.

‘‘తమ రాష్ట్రానికి చెందిన కార్మికులు, కూలీలు ఇతర రాష్ట్రాల్లో ఏవైనా అవస్థలు పడుతుంటే హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలంటూ హరియాణా ప్రభుత్వం పేర్కొందని, ఆ నెంబర్‌ సరిగ్గా పని చేస్తుందో, లేదో తెలుసుకునేందుకు తాము ఫోన్‌ చేసి ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పామ"ని వారు చెప్పడంతో అధికారులు, పోలీసులు నిర్ఘాంతపోయారు. తమను నానా హైరానా పెట్టినందుకు కార్మికులను అధికారులు మందలించి వదిలిపెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.


 

click me!