మానసిక దివ్యాంగురాలైన గేదెలు మేపుకునే ఓ యువతి మీద అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఐదు నెలలుగా అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన హనుమకొండలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
హనుమకొండ : ఆమె మానసిక దివ్యాంగురాలు.. కళ్లు సరిగా కనిపించవు... దీనిని ఆసరాగా చేసుకోని ఓ వ్యక్తి 5నెలలు molestationకి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని యవతికి బెదిరించాడు. hanamkonda జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కమలాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బండి కనకరాజం (48) గేదెలను, మేపుతూ, కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన Mental paranoia (18) సైతం గేదెలను మేతకు తీసుకెళ్తుండగా ఓ రోజు ఆమెపై కనకరాజం అత్యాచారానికి ఒడిగట్టాడు. ఐదునెలలుగా దారుణాన్ని కొనసాగిస్తున్నాడు.
గతవారం ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఏమైందని అడగడంతో జరిగిన విషయం చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో కనకరాజంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 18న ఇలాంటి ఘటనే తూర్పుగోదావరిలో చోటు చేసుకుంది. Village Volunteer గా పని చేస్తూ ఇళ్లకు వెళ్తున్న క్రమంలో ఓ minor girlతో పరిచయం పెంచుకున్న యువకుడు ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో ఆమెపై molestationకి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలి లంకకు చెందిన గ్రామ వాళ్లంటే బూసి సతీష్ (23) అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నమ్మించి అఘాయిత్యానికి తెగబడ్డాడు.
ఆ తరువాత ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని బెదిరించాడు. ఆదివారం బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సతీష్ పై పోక్సో కింద కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ ఆర్.కె.శుభ శేఖర్ తెలిపారు.
ఇదిలా ఉండగా, నిరుడు అక్టోబర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల కు చెందిన గ్రామ వాలంటీర్ ఒక బాలింత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఆదివారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అక్టోబర్ 22న Village Volunteer మల్ల గోపి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో అతని భార్య ఇంట్లో ఉంది. ఆమె బాలింత. భర్త లేడని చెప్పడంతో అతని ఫోన్ నెంబర్ కావాలని అడుగుతూ ఆమెతో misbehave చేశాడు. వాలంటీర్ చర్యతో షాక్ అయిన ఆమె.. ఉన్న ఫలానా బయటకు పరుగులు తీసింది. అతని ప్రవర్తనతో భయపడిపోయింది. ఇంటి పక్కనే ఉన్న మరో మహిళ ఫోన్ తీసుకుని విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అక్కడికి husband చేరుకునేసరికి వాలంటీర్ పరారయ్యాడు. దీనిపై బాధితురాలు మరుసటి రోజు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఘటన మీద విచారించిన పోలీసులు.. ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కోటయ్య తెలిపారు.