జైల్లో దోమలు.. జ్వరంగా ఉంది... దిశ కేసులో నిందితులు

By telugu teamFirst Published Dec 4, 2019, 7:47 AM IST
Highlights

జైల్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని దిశ కేసులో నిందితులు అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. మంగళవారం చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ ఎం.సంపత్ నిందితులోత మాట్లాడారు. ఆ సమయంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని వారు ఫిర్యాదు చేశారు. 

దిశ హత్యోదంతం యావత్ దేశాన్ని కదిలించింది. వెటర్నరీ డాక్టర్ కి జరిగిన  ఘటనపై దేశవ్యాప్తంగా గళించింది. నిందితులను బహిరంగంగా ఉరితీయాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. కాగా... ప్రస్తుతం నిందితులు చర్లపల్లి జైల్లో ఉన్నారు.  నిందితుల కోసం పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

నిందితులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సమయంలో... వారిని చంపేస్తామంటూ కొన్ని వేల మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. వారి నుంచి నిందితులను రక్షించేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ప్రజల కంట పడకుండా.. వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే.... ప్రస్తుతం నలుగురు నిందితుల్లో ఇద్దరికీ వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

AlsoRead ‘దిశ’ను బతికుండగానే కాల్చారు... జైల్లో ప్రధాన నిందితుడు...

జైల్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని దిశ కేసులో నిందితులు అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. మంగళవారం చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ ఎం.సంపత్ నిందితులోత మాట్లాడారు. ఆ సమయంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని వారు ఫిర్యాదు చేశారు. కాగా.. తనకు జ్వరంగా ఉందని ప్రధాన నిందితుడు ఆరిఫ్ చెప్పగా... అతనికి వైద్యం అందించారు.

మరో నిందితుడు కిడ్నీ సమస్యతో మాధపడుతుండటంతో అతనికి కూడా వైద్యం అందిస్తున్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. దిశ కేసులో నలుగురు నిందితులను తమ గదులు దాటి బయటకు రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. గదిలోపలే బాత్రూం కూడా ఉంది. టిఫిన్,భోజనం కూడా తలుపు కింద నుంచే అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

click me!