మీడియా వార్: ఈనాడుపై సాక్షి మీడియా దుమారం

First Published 22, May 2018, 3:27 PM IST
Highlights

తెలుగులో మీడియా వార్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

హైదరాబాద్: తెలుగులో మీడియా వార్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తెలుగులో మీడియా, ముఖ్యంగా ప్రింట్ మీడియా రెండుగా చీలిపోయిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కానీ, తప్పులు ఎత్తి చూపడం ద్వారా ఒకదాన్ని మరోటి దెబ్బ తీసుకునే తాజా ప్రచారం ఊపందుకుంది.

రాజీవ్ గాంధీకి సంబంధించిన ఓ వార్త ఈనాడులో తప్పుగా అచ్చయింది. అది ఘోరమైన తప్పే. రాజీవ్ గాంధీ వర్ధంతికి బదులుగా రాహుల్ గాంధీ వర్ధంతి అంటూ ఈనాడులో అచ్చయింది. దాన్ని నేరుగా సాక్షి మీడియా గ్రూప్ నుంచే వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. సాక్షి పేరు మీదనే వాట్సాప్ మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి.

ఇదిలావుంటే మరో వార్త కూడా. అది ఉప ముఖ్యమంత్రి చిన రాజప్పకు సంబంధించిన వార్త. ధైర్యం ఉంటే మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలి అనే శీర్షిక పెట్టి, దాని కింద ముఖ్యమంత్రి చినరాజప్ప అనే ఉపశీర్షిక పెట్టారు. ఉప ముఖ్యమంత్రి అని పెట్టడానికి బదులు ముఖ్యమంత్రి అని పెట్టారు. దాన్ని సాక్షి మీడియాకు సంబంధించినవాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 

ఇదిలావుంటే, సాక్షి మీడియాతో ప్రచారం అవుతున్న మరో మెసెజ్ నమస్తే తెలంగాణకు సంబంధించింది.  నమస్తే తెలంగాణలో రాజీవ్ గాంధీ వర్ధంతి అనడానికి బదులు రాహుల్ గాంధీ వర్ధంతి అని అచ్చయింది. 

వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది సాక్షి మీడియావాళ్లా కాదా అనేది తెలియదు గానీ ఆ పేరు మీద మాత్రం ప్రచారంలోకి వచ్చాయి. ఇరు పత్రికల మధ్య వ్యాపారపమైన పోటీ మాత్రమే కాకుండా రాజకీయ విభేదాలకు సంబంధించిన వైరం కూడా ఉంది. ఈ కారణంగా అవి వైరల్ అవుతూ వస్తున్నాయి.

Last Updated 22, May 2018, 3:27 PM IST