హైదరాబాద్‌లో వాస్తు నిపుణుడి ఇంట్లో భారీ చోరీ.. రూ. 3.93 కోట్ల నగదు, 450 గ్రాముల బంగారం అపహరణ

Published : Sep 16, 2023, 10:52 AM IST
హైదరాబాద్‌లో వాస్తు నిపుణుడి ఇంట్లో భారీ చోరీ.. రూ. 3.93 కోట్ల నగదు, 450 గ్రాముల బంగారం అపహరణ

సారాంశం

హైదరాబాద్‌ మధురానగర్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ చోటుచేసుకుంది. వాస్తు నిపుణుడు వీఎల్‌ఎన్ చౌదరి నివాసం ఉంటున్న ఇంట్లో ఈ చోరీ జరిగింది.

హైదరాబాద్‌ మధురానగర్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ చోటుచేసుకుంది. వాస్తు నిపుణుడు వీఎల్‌ఎన్ చౌదరి నివాసం ఉంటున్న ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో నుంచి 3.93 రూపాయలు, 450 గ్రాముల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగివచ్చేసరికి చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి కొనుగోలు కోసం ఉంచుకున్న డబ్బును దుండగులు ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధిచి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

ఇక, వాస్తు నిపుణులు వీఎల్ఎన్ చౌదరి ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే ఇంటి యజమాని ఖాళీ చేయమని చెప్పడంతో సొంత ఇళ్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే డబ్బును ఇంట్లో దాచి ఉంచాడు. అయితే ఈ నెల 12వ తేదీన ఉదయం బయటకు వెళ్లిన వీఎల్ఎన్ చౌదరి.. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత తిరిగి వచ్చాడు. అయితే చోరీ జరిగినట్టుగా గుర్తించారు. రూ. 3.93 కోట్లు, 450 గ్రాముల బంగారు కడ్డీలు, 3 ల్యాప్‌ట్యాప్‌లు, విలువైన పత్రాలు చోరీకి గురైనట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu