ఎల్బీ నగర్‌ : టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కార్ల షోరూమ్‌కి వ్యాపించిన మంటలు, 50 వాహనాలు దగ్ధం

Siva Kodati |  
Published : May 30, 2023, 09:19 PM ISTUpdated : May 30, 2023, 09:50 PM IST
ఎల్బీ నగర్‌ : టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కార్ల షోరూమ్‌కి వ్యాపించిన మంటలు, 50 వాహనాలు దగ్ధం

సారాంశం

హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లోని ఓ టింబర్‌ డిపోలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు దట్టంగా వ్యాప్తి చెందుతూ వుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం ఎల్‌బీ నగర్‌లోని ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. అయితే దాని పక్కనే మల్టీప్లెక్స్, అపార్ట్‌మెంట్లు, పాత కార్ల షోరూమ్ వున్నాయి. చూస్తుండగానే టింబర్ డిపో పక్కనే వున్న పాత కార్ల షోరూమ్‌కి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 50కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. అయితే కార్ల షోరూమ్‌లో సిలిండర్లు వుండటంతో భారీగా పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి.  ఆ పక్కనే వున్న కారు మెన్ కారు గ్యారేజ్ వరకు మంటలు వ్యాపించాయి. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది.. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల వారిని ఖాళీ చేయిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu