హయత్‌నగర్ రాజేశ్ కేసులో ట్విస్టులు : సుజాతతో ఇలా పరిచయం.. ఆమె ఇంటికి ఎందుకెళ్లాడు, దాడి చేసిందెవరు..?

Siva Kodati |  
Published : May 30, 2023, 08:48 PM IST
హయత్‌నగర్ రాజేశ్ కేసులో ట్విస్టులు : సుజాతతో ఇలా పరిచయం.. ఆమె ఇంటికి ఎందుకెళ్లాడు, దాడి చేసిందెవరు..?

సారాంశం

హైదరాబాద్ హయత్‌నగర్‌లో రాజేశ్ అనే యువకుడి మృతి కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సుజాత ఇంటికి కూతవేటు దూరంలోనే రాజేశ్ డెడ్ బాడీ లభ్యం కావడంతో కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. 

హైదరాబాద్ హయత్‌నగర్‌లో రాజేశ్ అనే యువకుడి మృతి కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సుజాత ఇంటికి సమీపంలోనే రాజేశ్ చనిపోవడంతో కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఇద్దరి మధ్య పరిచయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. కొద్దినెలల క్రితం సుజాత రాంగ్ డయల్ చేయడంతో ఫోన్ రాజేశ్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడగా.. తర్వాత వాట్సాప్‌ ఛాటింగ్ వరకు విషయం వెళ్లింది. ఇదే సమయంలో సుజాత డీపీని చూసి ఆమె అవివాహితురాలని భావించిన రాజేశ్.. ఆమెతో ప్రేమలో పడిపోయాడు. అంతేకాదు.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలాగే వీరిద్దరూ కలిసి కారులో పలుమార్లు షికార్లు చేసినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

ఇదిలావుండగా.. సుజాతకు వివాహం జరిగిన విషయం రాజేశ్‌కు తెలిసిపోయింది. దీంతో తనను సుజాత మోసం చేసిందని ఆమెపై భగ్గుమన్నాడు. అప్పటి నుంచి ఆమెను దూరం పెట్టాడు. ఇదే సమయంలో ఓసారి కలుద్దామంటూ సుజాత మెసేజ్ పెట్టడంతో రాజేశ్ స్పందించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుజాత.. నువ్వు రాకపోతే చనిపోతానంటూ బెదిరింపులకు దిగింది. దీనికి స్పందించిన రాజేశ్.. నువ్వు చనిపోతే, నేను కూడా చచ్చిపోతానంటూ చెప్పాడు. 

ALso Read: నా భార్య మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి: టీచర్ సుజాత భర్త నాగేశ్వరరావు

అయితే ఎట్టకేలకు సుజాతను కలిసేందుకు హయత్ నగర్ వచ్చాడు రాజేశ్. కానీ అప్పటికే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినిట్లుగా సమాచారం. అప్పటికే రాజేశ్ .. సుజాత ఇంటి పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద రాజేశ్ హత్య కేసు చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతూ పోలీసులకు సవాల్‌గా మారింది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu