జైల్లో.. మారుతీరావు సోదరుడి డైమండ్ ఉంగరాలు మాయం

Published : May 15, 2019, 09:58 AM IST
జైల్లో.. మారుతీరావు సోదరుడి డైమండ్ ఉంగరాలు మాయం

సారాంశం

గతేడాది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంఘటన ప్రణయ్ హత్య. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో... అమృత తండ్రి మారుతీరావు... ప్రణయ్ ని అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. 


గతేడాది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంఘటన ప్రణయ్ హత్య. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో... అమృత తండ్రి మారుతీరావు... ప్రణయ్ ని అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా...ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు తిరునగరు మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీం ఇటీవలె బెయిల్‌పై విడుదలయ్యారు. 

అయితే శ్రవణ్‌కుమార్ నల్గొండ జైల్లో ఉన్నప్పుడు అతని చేతికి ఉన్న డైమండ్‌ ఉంగరాలను జైలు అధికారులు స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. అవి ప్రస్తుతం మాయమవ్వడం కలకలం రేపుతోంది. డైమండ్‌ ఉంగరాలు మాయమయ్యాయని జైలు అధికారుల వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జైలర్‌ జలంధర్‌ యాదవ్‌పై అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు ఆరు లక్షలు ఉండొచ్చని బాధితులు తెలుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !