ప్రేమపెళ్లి, ఇద్దరు పిల్లలు...దాచిపెట్టి మరదలితో వివాహం.. విషయం తెలిసి భార్యపై సామూహిక లైంగికదాడి..

By AN TeluguFirst Published Aug 9, 2021, 12:51 PM IST
Highlights

జిల్లా కేంద్రంలోని  ఇందిరా నగర్ కు చెందిన రౌతు మురళి కృష్ణ ములుగు జిల్లా కేంద్రానికి చెందిన యువతిని 2007 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతడి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమెతో మంకమ్మతోట లో రహస్యంగా కాపురం పెట్టాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

కరీంనగర్లో వివాహితపై సామూహిక లైంగికదాడి జరిగిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. లైంగిక దాడికి పాల్పడిన నలుగురు తోపాటు సహకరించిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్  సీపీ సత్యనారాయణ ఆదివారం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

ఆయన కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని  ఇందిరా నగర్ కు చెందిన రౌతు మురళి కృష్ణ ములుగు జిల్లా కేంద్రానికి చెందిన యువతిని 2007 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతడి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమెతో మంకమ్మతోట లో రహస్యంగా కాపురం పెట్టాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

ఈ విషయం తెలియని కుటుంబ సభ్యులు అతడికి 2017లో   మేనమరదలితో వివాహం జరిపించారు. అయితే మురళీకృష్ణ కొద్దిరోజులుగా మేన మరదలిని అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో ఆమె మహిళాపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.  ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తుంది. ఇటీవల మురళీకృష్ణ కదలికలపై ఆరా తీసిన ఆమె అతడు గతంలోనే ప్రేమ వివాహం చేసుకున్నట్లు  తెలుసుకుంది. 

మంకమ్మ తోటలో కాపురం పెట్టాడని తెలుసుకున్న ఆమె ఆదివారం తన తల్లిని సోదరులు రాజశేఖర్, శ్రీధర్, నితిన్ లతోపాటు వారి స్నేహితుడైన  ఎండి ఫిరోజ్ ను  వెంట తీసుకెళ్ళింది. మంకమ్మ తోటలోని ఇంట్లో మురళి కృష్ణ భార్య పిల్లలతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆమె అన్నలు మురళీకృష్ణను పక్క గదిలోకి తీసుకెళ్ళి చితకబాదారు.

అదే సమయంలో రాజశేఖర్, శ్రీధర్, నితిన్, ఎండి ఫిరోజ్ కలిసి అక్కడే ఉన్న మురళి కృష్ణ భార్య (ప్రేమ వివాహం చేసుకున్న యువతి) పై  లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు రాజశేఖర్, శ్రీధర్, నితిన్,ఎండి ఫిరోజ్ తో పాటు వారికి సహకరించిన మేనమరదలు, ఆమె తల్లి పై కూడా  కేసు నమోదు చేశారు. సమావేశంలో అడిషనల్ డిసిపి (లాఅండ్‌ ఆర్డర్‌) ఎస్‌.శ్రీనివాస్, సీఐలు లక్ష్మీబాబు, శ్రీనివాస్‌ ఉన్నారు. 

click me!