మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. అగ్రనేత రామన్న భార్య సావిత్రి లొంగుబాటు..!

Published : Sep 21, 2022, 04:50 PM ISTUpdated : Sep 21, 2022, 08:20 PM IST
మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. అగ్రనేత రామన్న భార్య సావిత్రి లొంగుబాటు..!

సారాంశం

మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత రామన్న భార్య సావిత్రి తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు.

మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత రామన్న భార్య సావిత్రి తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. వరంగల్ జిల్లాకు చెందిన రామన్న మావోయిస్టు అగ్రనేతగా ఎదిగారు. 1994లో దళం సభ్యురాలు సావిత్రిని పెళ్లి చేసుకున్నారు. దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా రామన్న పనిచేశారు. రామన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, తెలంగాణ పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉండేవారు. ఆయనపై గతంలో రూ. 40 లక్షల రివార్డు ప్రకటించారు. అయితే రామన్న 2019లో గుండె పోటుతో ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మృతిచెందారు. 

 

 

రామన్న మరణం తర్వాత అతడి కొడుకు పోలీసులకు లొంగిపోయాడు. ఇక, రామన్న భార్య సావిత్రి కిష్టారం ఏరియా కమిటీకి సెక్రటరీగా వ్యవరించారు. అయితే కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి సావిత్రి దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ప్రెస్‌మీట్ ద్వారా వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం