మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు కరోనా పాజిటివ్

By telugu teamFirst Published Nov 7, 2020, 3:15 PM IST
Highlights

తెలంగాణలోని మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు కోరనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే మాజీ మంత్రి  శ్రీధర్ బాబుకు కరోనా పాజిటివ్ సోకింది. తన ట్విట్టర్ ద్వారా ఈ సమాచారాన్ని నియోజకవర్గ ప్రజలకు ఆయన చేరవేశారు. తనకు తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయిన శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు. 

తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తన అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. ఈ మధ్య కాలంలో వ్యక్తిగతంగా తనను కలిసిన వారందరూ విధిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ సందేశం ద్వారా కోరారు.

ఇదిలావుంటే, తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా 1607 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్ కారణంగా గత 24 గంటల్లో ఆరుగురు మరణించారు. తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 48 వేల 891కి చేరుకుంది. మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1372కు చేరుకుంది.

ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి కోలుకుని 2.27 లక్షల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఇంకా 19936 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాదులో కరోనా వైరస్ వ్యాధి తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపించడం లేదు. కొత్తంగా హైదరాబాదులో 296 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

మేడ్చెల్ జిల్లాలో 113 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఈ జిల్లాలో 124 కేసులు నమోద్యయాయి. నారాయణపేటలో కొత్తగా కేసులు నమోదు కాకపోవడం గమనార్హం.

తెలంగాణలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్ 14
భద్రాద్రి కొత్తగూడెం 124
జిహెచ్ఎంసి 296
జగిత్యాల 42
జనగామ 29
జయశంకర్ భూపాలపల్లి 21
జోగులాంబ గద్వాల 9
కామారెడ్డి 30
కరీంనగర్ 78
ఖమ్మం 84
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 14
మహబూబ్ నగర్ 23
మహబూబాబాద్ 28
మంచిర్యాల 30
మెదక్ 19
మేడ్చెల్ మల్కాజిగిరి 113
ములుగు 37
నాగర్ కర్నూలు 43
నల్లగొండ 67
నారాయణపేట 0
నిర్మల్ 16
నిజామాబాద్ 23
పెద్దపల్లి 26
రాజన్న సిరిసిల్ల 30
రంగారెడ్డి 115
సంగారెడ్డి 41
సిద్ధిపేట 69
సూర్యాపేట 46
వికారాబాద్ 16
వనపర్తి 22
వరంగల్ రూరల్ 25
వరంగల్ అర్బన్ 48
యాదాద్రి భువనగిరి 29

click me!