హుటాహుటిన రాజస్థాన్‌కి మాణికం: తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలపై రాహుల్‌తో చర్చించనున్న ఠాగూర్

By narsimha lodeFirst Published Dec 20, 2022, 11:07 AM IST
Highlights


తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాలపై  చర్చించేందుకు గాను  మాణికం ఠాగూర్  రాజస్థాన్ కు బయలుదేరారు.  రాష్ట్రంలో  చోటు  చేసుకున్న పరిణామాలపై  రాహుల్ గాంధీతో  ఠాగూర్  చర్చించనున్నారు. 

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో  చోటు చేసుకున్న పరిణామాలపై  ఎఐసీసీ ఫోకస్ పెట్టింది.  ఈ విషయాలపై  రాహుల్ గాంధీతో చర్చించేందుకుగాను  తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ   మాణికం ఠాగూర్  రాజస్థాన్ కు వెళ్లారు. నిన్ననే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాలపై  ఠాగూర్  ఎఐసీసీ చీఫ్  మల్లికార్జున ఖర్గేతో  రెండు గంటల పాటు చర్చించారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై  ఠాగూర్  ఖర్గేతో మాట్లాడారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను  చక్కదిద్దే విషయమై ఇద్దరు నేతలు చర్చించారు. ఖర్గే సూచనతో  ఈ విషయాలపై రాహుల్ గాంధీతో ఠాగూర్  చర్చించనున్నారు.  న్యూఢిల్లీ నుండి రాజస్థాన్ కు  ఠాగూరు వెళ్లారు. తెలంంగాణ  కాంగ్రెస్  వ్యవహరాలపై  రాహుల్ గాంధీతో  చర్చించనున్నారు టాగూర్.

ఈ నెల  10వ తేదీన  కాంగ్రెస్ కమిటీలను  ఎఐసీసీ  ప్రకటించింది.ఈ కమిటీల్లో  పార్టీలో  మొదటి నుండి  ఉన్నవారికి ప్రాధాన్యత లేదని  సీనియర్లు  ఆరోపిస్తున్నారు.  ఈ విషయమై 12న   సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమయ్యారు.  పార్టీ కమిటీల్లో చోటు దక్కని వారికి  న్యాయం ఎలా చేయాలనే దానిపై చర్చించారు.ఈ విషయాలపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ తీరుపై  అసంతృప్తిని వ్యక్తం  చేస్తూ  మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేశారు. అంతేకాదు  పార్టీ సీనియర్ అధికార ప్రతినిధిగా  ఉన్న  బెల్లయ్య నాయక్ కూడ తన పదవికి రాజీనామా చేశారు.ఈ కమిటీపై మాజీ డిప్యూటీ సీఎం  దామోదర రాజనర్సింహ  సీరియస్ వ్యాఖ్యలు  చేశారు. పార్టీ కమిటీల్లో  న్యాయం జరగలేదన్నారు.  ఈ వ్యాఖ్యలు  చేసిన తర్వాత  సీనియర్లు ఈ నెల  19న మల్లు భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  పార్టీ కమిటీలపై చర్చించారు. ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన నేతలకే కమిటీల్లో చోటు కల్పించారని  ఆరోపించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఈ పరిణామాలతో  ఈ నెల  17న వలసవాదులుగా  సీనియర్లు ఆరోపిస్తున్న  నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ నెల  17న పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇవాళ మరోసారి  సమావేశం  కానున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాలపై  కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ నదీమ్ జావెద్  పార్టీ నాయకత్వానికి నివేదిక అందించారు.  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా ఆరా తీశారు.  ఈ పరిణామాలపై ఠాగూర్  మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు

click me!