వికారాబాద్‌లో ఓ వ్యక్తి పేరుతో 38 బ్యాంకు ఖాతాలు.. ఇంటి లోన్ కోసం వెళ్లి షాక్ తిన్న వ్యక్తి..!

By Sumanth KanukulaFirst Published Mar 21, 2023, 11:12 AM IST
Highlights

వికారాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి పేరు మీద 38 బ్యాంకు ఖాతాలు ఉన్న విషయం తాజాగా వెలుగులోకి  వచ్చింది. అయితే తనకు తెలియకుండానే బ్యాంకు ఖాతాలు ఓపెన్ అయినట్టుగా ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

వికారాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి పేరు మీద 38 బ్యాంకు ఖాతాలు ఉన్న విషయం తాజాగా వెలుగులోకి  వచ్చింది. అయితే తనకు తెలియకుండానే బ్యాంకు ఖాతాలు ఓపెన్ అయినట్టుగా ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వివరాలు.. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండల కేంద్రానికి చెందిన మంగళి అనంతయ్య ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టాడు. కొంతమేర పనులు పూర్తి చేసిన అనంతయ్య.. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు లోన్ తీసుకుందామని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంకుకు వెళ్లాడు. 

అక్కడ అనంతయ్య నుంచి వివరాలు సేకరించిన బ్యాంకు సిబ్బంది.. అతని పేరుతో 38 అకౌంట్లు ఉన్నాయని తెలిపారు. అందులో 12 అకౌంట్లు యాక్టివ్‌లో, మిగతా 26 క్లోజ్‌ అయ్యాయని చెప్పారు. అలాగే అతడి పేరు మీద ఓ లోన్ కూడా ఉందని తెలిపారు. దీంతో అనంతయ్య షాక్ తిన్నాడు. ఈ క్రమంలోనే అనంతయ్య పోలీసులను ఆశ్రయించారు. తనకు తెలియకుండా ఎవరో తన పేరు మీద బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేశారని అనంతయ్య తెలిపారు. 

ఈ క్రమంలోనే అనంతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో తాను షాక్‌కు గురయ్యానని అనంతయ్య తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. 

click me!