నడిరోడ్డుపై నిప్పంటించుకుని వ్యక్తి సజీవదహనం

Siva Kodati |  
Published : Mar 08, 2019, 11:55 AM IST
నడిరోడ్డుపై నిప్పంటించుకుని వ్యక్తి సజీవదహనం

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.... సనత్‌నగర్‌లోని స్నేహపురి కాలనీకి చెందిన వెంకటేశ్ గుప్తా అనే వ్యక్తి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను గమనించిన జనం భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు వెంకటేశ్ సజీవ దహనమవుతున్న దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డవ్వడంతో అవి వైరల్ అయ్యాయి. కాగా, వ్యాపారంలో నష్టాలు రావడం వల్లే వెంకటేశ్ ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.