తెలంగాణలో కాంగ్రెస్ కి షాక్... కారెక్కుతున్న మరో ఎమ్మెల్యే

Published : Mar 08, 2019, 10:00 AM IST
తెలంగాణలో కాంగ్రెస్ కి షాక్... కారెక్కుతున్న మరో ఎమ్మెల్యే

సారాంశం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే  కారు ఎక్కడానికి సిద్ధమయ్యారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే  కారు ఎక్కడానికి సిద్ధమయ్యారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌ని కూడా ఆయన కలిసి మాట్లాడారు. రెండుమూడు రోజుల్లో  టీఆర్‌ఎస్‌లో చిరుమర్తి చేరబోతున్నారు. 

ఈ విషయంలో ఆ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి చొరవ తీసుకుని చిరుమర్తితో సంప్రదింపులు సమాచారం. ఈ సంప్రదింపులు సైతం సఫలమైయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చిరుమర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ సైతం స్విచ్‌ఆఫ్ చేసుకున్నారు.

అయితే.. చిరుమర్తి వ్యవహారంలో.. ఎక్కువ దెబ్బ కొమటిరెడ్డి బ్రదర్స్ కే తగిలిందని చెప్పొచ్చు. చిరుమర్తి లింగయ్య ముందునుంచి కూడా కోమటిరెడ్డి వర్గానికి గట్టి మద్దతుదారుగా నిలుస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో చిరుమర్తికి పార్టీ టిక్కెట్ వస్తుందో రాదో అన్న ఊగిసలాట జరిగినపుడు కోమటి రెడ్డి బ్రదర్సే దగ్గరుండి చిరుమర్తికి టిక్కెట్ ఖరారు చేయించారు.

ఇప్పుడు.. చిరుమర్తి టీఆర్ఎస్ జెండా పట్టుకోవడంపై కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం