ప్రేమ పేరుతో లోంగదీసుకుని.. తల్లిని చేశాడు: నిందితుడికి పదేళ్ల జైలు

Siva Kodati |  
Published : Jul 09, 2019, 12:49 PM IST
ప్రేమ పేరుతో లోంగదీసుకుని.. తల్లిని చేశాడు: నిందితుడికి పదేళ్ల జైలు

సారాంశం

ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని ఓ వ్యక్తి విద్యార్ధినిని నమ్మించి అత్యాచారం చేసిన వ్యక్తి న్యాయస్థానం పదేళ్ల కారాగార శిక్ష విధించింది.

ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని ఓ వ్యక్తి విద్యార్ధినిని నమ్మించి అత్యాచారం చేసిన వ్యక్తి న్యాయస్థానం పదేళ్ల కారాగార శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళ్లితే.. హైదారాబాద్ వనస్థలిపురం సమీపంలోని సచివాలయ నగర్‌కు చెందిన షేక్ మొహమ్మద్ జహంగీర్‌పాషా అనే వ్యక్తి 2006-07 మధ్య హయత్‌నగర్‌ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేశాడు.

ఈ సమయంలో పదో తరగతి విద్యార్ధినిపై కన్నేసిన జహంగీర్ ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. యువతి అందుకు అంగీకరించకపోవడంతో ఇంటర్మీడియట్ చదివే సమయంలోనూ తన ప్రయత్నాలు మానలేదు.

2012లో ఆమెను ఎలాగోలా లోంగదీసుకుని అత్యాచారం చేశాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది.. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె జహంగీర్‌ను నిలదీయడంతో అప్పటికే తాను మరో యువతిని పెళ్లి చేసుకున్నానని ముఖం చాటేశాడు.

దీంతో చేసేది లేక యువతి మీర్‌పేట పోలీసులు ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిపై నమ్మకద్రోహం, అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

ఈ కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా మొదటి అదనపు ప్రత్యేక మహిళా సెషన్స్ కోర్టు జహంగీర్‌ను దోషిగా నిర్ధారించింది. అతనికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 60 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu