కూతురిపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష...

Published : Aug 01, 2023, 12:00 PM IST
కూతురిపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష...

సారాంశం

ఓ వ్యక్తి కన్న కూతురిపై కామంతో దాడి చేశాడు. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఆ వ్యక్తికి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష విధించింది కోర్టు.  

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ వ్యక్తికి కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2019లో తన కూతురిపై అత్యాచారం చేసిన కేసులో మల్కాజిగిరికి చెందిన 34 ఏళ్ల వ్యక్తికి మల్కాజిగిరిలోని పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నిందితుడు అప్పుడు దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అతని భార్య టీ స్టాల్ నడుపుతూ ఆలస్యంగా ఇంటికి వచ్చేది. వారి ముగ్గురు కుమార్తెలను తండ్రి వద్ద వదిలిపెట్టింది. 

మే 2019 లో, పనికి వెళ్లిన భార్య రెండో కూతురికోసం మధ్యలోనే ఇంటికి వచ్చింది. ఆ చిన్నారి వయసు ఆ సమయంతో 11 సంవత్సరాలు. ఆమె కనిపించడంలేదని.. వెతుకుతూ తిరిగి ఇంటికి వచ్చింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యింది. ఇంట్లో కూతురిపై భర్త దాడి చేయడం కనిపించింది. 

భార్య ఇంట్లో లేనప్పుడు.. కూతురి భోజనంలో నిద్ర మాత్రలు కలిసి అత్యాచారం.. తండ్రికి మరణించే వరకు జైలుశిక్ష..

ఆమె గట్టిగా కేకలు వేయడంతో అతను పారిపోయాడు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పుడు తీర్పు వెలువడింది. 

ఇదిలా ఉండగా, 15రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరబాద్ లో ఓ అత్యాచార నిందితుడికి 20యేళ్ల కఠిన కారాగారశిక్ష పడింది. నగరంలోని భవానీనగర్‌లో తన బంధువుపై 58 ఏళ్ల వ్యక్తిపలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తికి పోక్సో కేసుల 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కమ్ స్పెషల్ కోర్టు జడ్జి టి.అనిత శుక్రవారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.

దీనితో పాటు 5,000 జరిమానా చెల్లించాలని, బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆర్థికంగా చితికిపోయిన బాధితురాలి తల్లిదండ్రులు దోషి పనిచేసిన పాఠశాలలో ఆ అమ్మాయిని చేర్పించారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాధితురాలు కొద్దికాలం దాడిని భరించింది. అదింకా ఆగేలాగా లేకపోవడంతో.. ఆమె ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు ఈ విషయాన్ని తెలియజేసింది. వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇది సహాయపడిందని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. ప్రతాప్ రెడ్డి తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే
YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu