హైద్రాబాద్‌లో టీ స్టాల్‌లోకి దూసుకెళ్లిన కారు: ప్రాణాపాయం నుండి తప్పించుకొన్న వ్యక్తి

Published : Mar 28, 2021, 01:03 PM IST
హైద్రాబాద్‌లో టీ స్టాల్‌లోకి దూసుకెళ్లిన కారు: ప్రాణాపాయం నుండి తప్పించుకొన్న వ్యక్తి

సారాంశం

హైద్రాబాద్ చైతన్యపురి వాసవీకాలనీలో అతి వేగంగా వచ్చిన కారు టీ దుకాణంలోకి దూసుకెళ్లింది.దీంతో షాపులో ఫర్నీచర్  ధ్వంసమైంది.


హైదరాబాద్: హైద్రాబాద్ చైతన్యపురి వాసవీకాలనీలో అతి వేగంగా వచ్చిన కారు టీ దుకాణంలోకి దూసుకెళ్లింది.దీంతో షాపులో ఫర్నీచర్  ధ్వంసమైంది.అతి వేగంగా దూసుకు వచ్చిన కారు టీ షాపులోకి దూసుకెళ్లింది. దీంతో ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

కారును అజాగ్రత్తగా నడిపిన  డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కారు అతివేగంగా  వస్తున్న సమయంలో గమనించిన టీ స్టాల్ యజమాని గుర్తించి వెంటనే పక్కకు తప్పుకొన్నాడు.దీంతో ఆయన ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు. 

కారుకు బ్రేకులు ఫెయిలయ్యాయా.. లేదా డ్రైవర్ అజాగ్రత్తగా నడిపాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన సీసీటీవీ పుటేజీలో  రికార్డయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

విద్యార్థుల‌కు అంత‌ర్జాతీయ స్థాయి శిక్ష‌ణ‌.. జ‌పాన్‌తో యంగ్‌ ఇండియా స్కిల్స్ వ‌ర్సిటీ ఒప్పందం
RTC: ఇక కండ‌క్ట‌ర్‌తో ప‌ని లేదు.. మీ టికెట్ మీరు తీసుకోవ‌చ్చు. ఆర్టీసీలో స‌రికొత్త ప్ర‌యోగం