కళ్లలో కారం చల్లి, కత్తులతో నరికి.. రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య !

Published : Sep 11, 2021, 09:16 AM IST
కళ్లలో కారం చల్లి, కత్తులతో నరికి.. రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య !

సారాంశం

రంగారెడ్డి జిల్లాలో అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి కళ్లలో కారం చల్లి, కత్తులతో నరికి.. హత్య చేశారు. ఈ ఘటన శంకర్ పల్లి మండలం అలంఖాన్ గూడ గేటు సమీపంలో చోటు చేసుకుంది.

శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లాలో అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి కళ్లలో కారం చల్లి, కత్తులతో నరికి.. హత్య చేశారు. ఈ ఘటన శంకర్ పల్లి మండలం అలంఖాన్ గూడ గేటు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన విషయం  తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

అక్కడ దొరికిన ఆధారాలను బట్టి మృతుడు మహాలింగాపురానికి చెందిన వెంకటయ్య (40)గా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అసలు హత్య జరగడానికి కారణాలేంటి? ఎవరు చంపారు? ఈ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే