నిద్రపోతున్న చిన్నారిపై అత్యాచారం

Published : May 30, 2020, 07:21 AM IST
నిద్రపోతున్న చిన్నారిపై అత్యాచారం

సారాంశం

దీంతో పెద్ద కుమార్తెను తీసుకొని పటాన్ చెరులోని ఓ పరిశ్రమలో పనిచేయడానికి వెళ్లారు. చిన్న కుమార్తెను(10) , ఆమె అమ్మమ్మను ఇంటి దగ్గరే ఉంచారు. బాలిక  ఒంటరిగా ఉండటంతో.. ఆమెపై స్థానికుడు ఒకడు కన్నేశాడు. వేసవి కావడంతో బాలిక తన అమ్మమ్మతో కలిసి ఆరు బయట నిద్రించింది.

అభం శుభం ఎరగని చిన్నారిపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఆరు బయట ప్రశాంతంగా నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శేరిలింగంపల్లిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీ వాంబే నివాస సముదాయాల్లో ఓ పేద కుటుంబం జీవిస్తోంది. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాగా.. వారు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వారికి పనులు లభించలేదు.

దీంతో పెద్ద కుమార్తెను తీసుకొని పటాన్ చెరులోని ఓ పరిశ్రమలో పనిచేయడానికి వెళ్లారు. చిన్న కుమార్తెను(10) , ఆమె అమ్మమ్మను ఇంటి దగ్గరే ఉంచారు. బాలిక  ఒంటరిగా ఉండటంతో.. ఆమెపై స్థానికుడు ఒకడు కన్నేశాడు. వేసవి కావడంతో బాలిక తన అమ్మమ్మతో కలిసి ఆరు బయట నిద్రించింది.

అదే అదునుగా చేసుకున్న కిరాతకుడు.. బాలిక నోరు మూసి ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని స్థానికులు గమనించి ప్రశ్నించగా.. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా.. బాలిక ఇంట్లో  అపస్మారక స్థితిలో పడి ఉంది. గమనించిన స్థానికులు బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం