పిల్లలు పుట్టడం లేదని... భార్యను చంపిన భర్త

Published : Jun 24, 2020, 10:15 AM IST
పిల్లలు పుట్టడం లేదని... భార్యను చంపిన భర్త

సారాంశం

దంపతులిద్దరూ వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారు. కాగా ఇన్నేళ్లయినా సంతానం కలగడం లేదని మల్లయ్య తరచూ పద్మను వేధింపులకు గురిచేసేవాడు. 

పిల్లలు పుట్టడం లేదని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను ఓ భర్త అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన కరీంనగర్ లోని కథలాపూర్ మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కథలా పూర్ మండలంలోని తాండ్ర్యాలకు చెందిన గంగుల మల్లయ్యకి గంభీర్ పూర్ కి చెందిన పద్మ(36)తో పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. దంపతులిద్దరూ వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారు. కాగా ఇన్నేళ్లయినా సంతానం కలగడం లేదని మల్లయ్య తరచూ పద్మను వేధింపులకు గురిచేసేవాడు. 

ఈ క్రమంలో సోమవారం రాత్రి గొడవ జరిగింది. ఆవేశంతో మల్లయ్య రోకలితో ఆమె తలపై కొట్టాడు. అనంతరం చీరతో ఉరేసి, పరారయ్యారు. పద్మ మృతి విషయం మంగళవారం ఉదయం వె లుగులోకి వచ్చింది. సంఘటన స్థలాన్ని కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు, కథలాపూర్‌ ఎస్సై పృథ్వీధర్‌గౌడ్‌ పరిశీలించారు. గ్రామస్తులను, బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి సోదరుడు హన్మాండ్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో ముంబై తరహా కుండపోత వర్షాలే, ఇక అల్లకల్లోలమేనా?
Rain Alert : తెలుగు ప్రజలారా ఊపిరి పీల్చుకొండి.. ఇక వర్షాలు షురూ కాబోతున్నాయి, ఎప్పట్నుంచో తెలుసా?