మాట్లాడుకుందాం రమ్మని....భార్య, 4 నెలల కొడుకును సజీవ దహనం చేసిన భర్త

Published : Feb 11, 2019, 07:54 AM ISTUpdated : Feb 11, 2019, 08:08 AM IST
మాట్లాడుకుందాం రమ్మని....భార్య, 4 నెలల కొడుకును సజీవ దహనం చేసిన భర్త

సారాంశం

భార్యను, నాలుగు నెలల కొడుకును సజీవదహనం చేశాడో భర్త.. వివరాల్లోకి వెళితే...జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన మాచెల్ల రమేశ్, గూడురుకు చెందిన కందిగ శుశ్రుత 2015లో ప్రేమించుకున్నారు. 

భార్యను, నాలుగు నెలల కొడుకును సజీవదహనం చేశాడో భర్త.. వివరాల్లోకి వెళితే...జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన మాచెల్ల రమేశ్, గూడురుకు చెందిన కందిగ శుశ్రుత 2015లో ప్రేమించుకున్నారు. వీరిద్దరివి వేర్వేరు సామాజిక వర్గాలు.. అయినప్పటికీ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు 4 నెలల బాబు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో శుశ్రుత కొద్దిరోజులుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. సమస్యను పరిష్కరించుకుందామని రమేశ్ భార్యను ఉప్పల్‌కు పిలిపించాడు. కుమారిడితో కలిసి శుశ్రుత ఔటర్ రింగ్ రోడ్‌కు చేరుకుంది.

ఈ సందర్భంగా భార్యాభర్తలు మరోసారి గొడవపడ్డారు.. దీనిపై మనస్తాపం చెందిన శుశ్రత ఇంటి వద్ద నిద్రమాత్రలను మింగింది.. అంతేకాకుండా చిన్నారికి సైతం పాలలో కలిపి తాగించింది. అపస్మారక స్థితికి చేరుకున్న వారిద్దరిని రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రభాకర్ ఎన్‌క్లేవ్ ప్రాంతానికి తరలించిన రమేశ్ అనంతరం పెట్రోలో పోసి తగులబెట్టి పాలకుర్తి పోలీసులకు లొంగిపోయాడు.

ఆ తర్వాత అటుగా వెళ్తున్న స్థానికులకు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులను కాల్చి వేసినట్లుగా కనిపించడంతో వారు ఘట్‌కేసర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సగం కాలిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

DECODE : Advocate Allam Nagaraju Sensational Comments : లాయర్ అల్లం నాగరాజు సంచలన కామెంట్స్
Government Jobs : గట్టిగా ట్రై చేస్తే నెలకు రూ.1,27,050 జీతంతో ఓ సర్కార్ నౌకరీ మీదే.. టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డిటెయిల్స్